టిక్కెట్లు అమ్మిన సల్మాన్
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/salman-khan.jpg' align='left' alt=''>ప్రేక్షకాభిమానులను థియేటర్లకు రప్పించేందుకు ఎప్పటికప్పుడు కొత్త టెక్నిల్ లు ఎంచుకోవడంలో బాలీవుడ్ ముందంజలో ఉంది. స్టార్ హీరో సల్మాన్ సైతం ఇప్పుడు ఇదే బాట పట్టారు. తన కొత్త చిత్రం 'లండన్ డ్రీమ్స్' ప్రమోషన్ వర్క్ లో భాగంగా సోమవారంనాడు ఆయన టిక్కెట్ సెల్లర్ అవతారం ఎత్తారు. ఢిల్లీలోని డిలైట్ థియేటర్ లో టిక్కెట్ కౌంటర్ లో కూర్చుని హాట్ కేకుల్లా అమ్మకాలు జరిపారు. టిక్కెట్లపైన ఆయన ఆటోగ్రాఫ్ కూ డా చేర్చడంతో అడ్వాన్స్ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి.
ఆడియెన్స్ కు చేరువ కావడం అనే ఈ ఆలోచన దర్శకుడు విపుల్ షాదేననీ, ప్రతి చిత్రానికి ప్రమోషన్ అవసరమేననీ, ఈ సినిమా కోసం ఇంకొంచెం డిఫరెంట్ గా ప్రమోషన్ చేస్తున్నామనీ సల్మాన్ తెలిపారు. మ్యూజిక్ బిజినెస్ లో అత్యున్నత స్థాయికి చేరుకోవాలనే ఓ యువకుడి ప్రస్థానమే 'లండన్ డ్రీమ్స్'. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, ఆసిన్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి విపుల్ షా దర్శకుడు. 'వాంటెడ్' చిత్రం సక్సెస్ తో ఎంతో ఉత్సాహంగా ఉన్న సల్మాన్ 'లండన్ డ్రీమ్స్' పై కూడా ఎక్కువ అంచనాలే పెట్టుకున్నారు. స్నేహం గొప్పతనాన్ని చెప్పే ఇతివృత్తంతో ఈ చిత్రం ఉంటుందనీ, ఒక ఫ్రెండ్ కలలను నిజం చేసేందుకు మరొక ఫ్రెండ్ ఏం చేశాడనేది ఆసక్తికరంగా ఉంటుందనీ సల్మాన్ తెలిపారు. సల్మాన్, అజయ్ దేవగణ్ కలిసి ఈ చిత్రంలో నటించడం పదేళ్ల తర్వాత ఇదే ప్రథమం. 1999లో వచ్చిన 'హమ్ దిల్ చుకే సనమ్' చిత్రంలో ఈ ఇద్దరూ కలిసి నటించారు.
News Posted: 27 October, 2009
|