శిల్పా పెళ్లి తేదీ ఖరారు
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/shilpa-raj3.jpg' align='right' alt=''>ముంబై: ఇటలీ పారిశ్రామిక వేత్త రాజ్ కుంద్రాతో శిల్పాశెట్టి నిశ్చితార్ధం ముంబైలో గత శనివారంనాడు ఇరు కుటుంబ సభ్యులు, ఆత్మీయ అతిథుల సమక్షంలో సంబరంగా జరిగింది. తాజాగా శిల్పా వివాహ మూహూర్తం కూడా ఖరారైంది. వారం రోజుల క్రితమే ఈ ముహూర్తం ఖరారైనట్టు శిల్పా తన బ్లాగ్ లో పేర్కొంది. తన అభిమానులంతా ఎంతో ఉత్సుకతో ఈ తేదీ కోసం ఎదురు చూస్తున్నారనే విషయం తనకు తెలుసుననీ, అయితే ఇప్పుడే తాను ఆ విషయం వెల్లడించలేననీ మరోసారి సస్పెన్స్ లో ఉంచింది. తన సోదరి సమక్షంలో అతి త్వరలోనే ఆ తేదీని వెల్లడిస్తానని వివరణ ఇచ్చింది.
శిల్పాషెట్టి చెల్లెలు షమిత షెట్టి ప్రస్తుతం కలర్స్ ఛానెల్ లో వస్తున్న 'బిగ్ బాస్ 3' రియాల్టీ షోలో పాల్గొంటోంది. ఆ షో నిబంధనల ప్రకారం మరో పది మందితో కలిసి ఓ గదిలో ఆమె ఉంటున్నారు. బాహ్య ప్రపంచంతో సంబంధాలు కూడా లేవు. తన సోదరి దగ్గర్లో లేదనే బాధ తనకు ఉందని శిల్పా చెప్పుకొచ్చింది. అక్కాచెల్లెళ్లుగా సుఖసంతోషాలు పంచుకోవాల్సిన ఇలాంటి తరుణంలో షమిత అందుబాటులో లేకుండా ఉండటం బాధగానే ఉందనీ, రియాల్టీ షోలో ఉన్నందు వల్లే తమకు నిశ్చితార్ధం జరిగిన విషయం కూడా ఆమెకు తెలియదని అన్నారు. 'బిగ్ బాస్' హౌస్ నుంచి వచ్చిన వెంటనే నిశ్చితార్ధం విషయం తెలుసుకుని షమిత షాక్ అవుతుందనీ, గొడవ చేస్తుందనీ, అలుగుతుందనీ, అయితే ఆమెకు నచ్చజెప్పి శాంతపరుస్తారనీ శిల్పా చెప్పుకొచ్చింది.
News Posted: 27 October, 2009
|