బుద్ధ దంతంపై కమల్ ఫిల్మ్
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/kamal-buddha.jpg' align='right' alt=''>పద్మశ్రీ కమల్ హాసన్ ద్విభాషా చిత్రం 'ఈనాడు' ('ఎ వెన్స్ డే' రీమేక్) తర్వాత ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమై ఉంటుందనేది కొంతకాలంగా చర్చ జరుగుతోంది. 'మరుద నాయగన్', 'మర్మయోగి' వంటి డ్రీమ్ ప్రాజెక్ట్ ల తరహాలోనే ఈసారి కూడా ఆయన ఓ పీరియాడిక్ డ్రామాను చేయబోతున్నారనీ, దీనికి మిస్కిన్ దర్శకత్వం వహించనున్నారనీ కొద్దికాలంగా ప్రచారంలో ఉన్నదే. తాజా సమాచారం ప్రకారం కమల్ కథకు ప్లాట్ రెడీ అవుతోందనీ, దశావతారాల్లో ఒక అవతారంగా భావించే బుద్ధుడి దంతం కథాంశంగా ఈ చిత్రం ఉండబోతోందనీ తెలుస్తోంది.
శ్రీలంకంలోని కాండీ బౌద్ధారామంలో బుద్ధుని దంతం ఉంది. గౌతమ బుద్ధుని గురించి చరిత్రలో ఎన్నో విశేషాలు చేటుచేసుకున్నాయి. బుద్ధుని దంతం శ్రీలంకకు ఎలా వచ్చింది? దానికోసం జరిగిన యుద్ధాల్లో ఎంతమంది చనిపోయారు? వంటి అంశాలపై ఆసక్తికరమైన కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. వీటిగా లోతుగా అధ్యయనం చేసి అత్యంత భారీ బడ్జెట్ తో ఈ పీరియాడిక్ ఫిల్మ్ ను తెరకెక్కించాలని కమల్ ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కమల్ ఈ భారీ ప్రాజెక్ట్ కోసం పలువురు హాలీవుడ్ స్టూడియో అధిపతులను కలుసుకుని వారి భాగస్వామ్యంతో దీనిని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. కమల్ నుంచి మరో ప్రిస్టేజియస్ మూవీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఆయన అమెరికా ట్రిప్ నుంచి తిరిగొచ్చిన వెంటనే తీపి కబురు అందుతుంది.
News Posted: 28 October, 2009
|