'దటీజ్' జాక్సన్...
పాప్ సంగీతం ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మైఖైల్ జాక్సన్ మరణాంతరం కూడా ఆయన ప్రభంజనం తగ్గలేదు. మైకేల్ జాక్సన్ సినిమా 'దిసీజ్ ఇట్' చిత్రం తొలి ఐదు రోజుల్లో 281 కోట్ల రూపాయలు (101 మిలియన్ డాలర్లు) వసూలు చేసింది. సోనీ స్టూడియో 281 కోట్ల రూపాయలతో ఈ చిత్రం హక్కులను సొంత చేసుకుంది. మొదటి ఐదు రోజుల్లోనే పెట్టుబడిని రాబట్టుకోవడంతో పాటు భారీ లాభాలను కూడా అందిపుచ్చుకుంది. తొలి వారాంతం వసూళ్లను సోనీ సంస్థ ప్రకటించింది.
తొలుత ఈ చిత్రాన్నిఅమెరికాలో రెండు వారాల పాటు ప్రదర్శించాలని అనుకున్నామనీ, అయితే ప్రేక్షకుల నుంచి అపూర్వ స్పందన వస్తుండటంతో ఆ గడువును మరింత పొడిగించే అవకాశముందనీ ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. 'దిసీజ్ ఇట్' ప్రమోషన్ వర్క్ కోసం పలు స్టేజ్ షోలు నిర్వహించేందుకు వరల్డ్ టూర్ చేపట్టాలని జాక్సన్ సన్నాహాలు చేసినప్పటికీ ఇంతలోనే ఆయనను మృత్యువాత పడ్డారు.
News Posted: 3 November, 2009
|