రాజకీయాల్లోకి మనీషా
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/manisha1.jpg' align='right' alt=''>నేపాల్ రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా ఎంతో ఆసక్తిగా ఉంది. మనీషా తాతలైన బి.పి.కొయిరాలా, జి.పి. కొయిరాలా నేపాల్ ప్రధానులుగా పనిచేశారు. ఇటీవల దీపావళి వెకేషన్స్ కోసం ఖాట్మండు వెళ్లిన మనీషా అక్కడే ఉన్న బి.పి.కొయిరాలా స్మారక ప్రదేశాన్ని సందర్శించడంతో ఆమె రాజకీయాల్లోకి రాబోతోందనే ప్రచారం ఊపందుకుంది. ఆమె నేపాల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుందా, తన కుటుంబ సభ్యులున్న నేపాలీ కాంగ్రెస్ లో చేరుతుందా అనేది ఇంకా స్పష్టం కానప్పటికీ తన కెరీర్ కు ప్రత్యామ్నాయం వెతుక్కోవాలనే ఆలోచనలో మాత్రం ఉంది.
'నేను రాజకీయాల్లో చేరే అవకాశముంది' అని ఈనెల 5న తన వర్క్ అసైన్ మెంట్ కోసం లాస్ ఏంజెల్స్ బయలుదేరే ముందు మనీషా స్పష్టం చేసింది. ఇటీవల ఖాట్మంటు వెళ్లినప్పుడు అక్కడి సామాజిక, రాజకీయ పరిస్థితి తనలో కొత్త ఆలోచనలను రేకెత్తించాయని ఆమె తెలిపారు. ప్రస్తుతం తాను ముంబైలో రెండు చిత్రాలు పూర్తి చేయాల్సి ఉందని చెప్పింది.ఇటీవల అమెరికాలో నాలుగు నెలల పాటు ఉన్న మనీషా తన కార్యకలాపాలను ముంబై నుంచి అక్కడు మార్చే యోచనలో ఉంది. లాస్ ఏంజెల్స్ లో తనకు మంచి సంబంధాలు ఏర్పడ్డాయనీ, సినిమాలకు సంబంధించి లాస్ ఏంజెల్స్ నే ప్రధాన కేంద్రంగా చేసుకుంటాననీ ఆమె చెప్పింది. తన తల్లిదండ్రులు ప్రస్తుతం ఖాట్మండులో ఉన్నారనీ, అందువల్ల ముంబై డ్యూప్లెక్స్ లో ఒంటరిగా తాను ఉండలేననీ పేర్కొంది. మనీషా సోదరుడు సిద్ధార్ధ, ఆయన కుటుంబ సభ్యులకు ముంబైలో సొంత అపార్ట్ మెంట్ ఉంది. రాజకీయాల్లో చేరాలనే తన ఆలోచనలు ఇంకా మొగ్గ దశలోనే ఉన్నాయనీ, రాజకీయాల్లో చేరదలుచుకుంటే మాత్రం ఎక్కువ సమయం ఖాట్మండులోనే ఉండాల్సి వస్తుందనీ ఆమె స్పష్టం చేసింది. రాజకీయాల్లోకి చేరినా సినీ రంగంతో తన సంబంధం ఏదోరకంగా కొనసాగుతూనే ఉంటుందని తెలిపింది.
News Posted: 4 November, 2009
|