ఈషా కోప్పికర్ వివాహం 29న
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/isha-timmy.jpg' align='right' alt=''>బాలీవుడ్ బ్యూటీ ఈషా కోప్పికర్ వివాహ ముహూర్తం ఖరారైంది. తన బాయ్ ఫ్రెండ్, వ్యాపారవేత్త టిమ్మీ నారంగ్ తో ఈనెల 29న ఆమె మూడుముళ్లు వేయించుకోనుంది. మంగలోరియన్ స్టైల్ లో సంప్రదాయబద్ధంగా ఈ వివాహం జరుగనుంది. అనంతరం నారంగ్ నివాసంలో రెసెప్షన్ ఇవ్వనున్నారు.
'బ్యాచిలర్స్ పార్టీ ఇచ్చేందుకు ప్రస్తుతం టిమ్మీ బ్యాంకాక్ లో ఉన్నాడు. వ్యాపారం పనిమీద వెళ్లినప్పటికీ ఆ పనితో పాటు మిత్రులకు పార్టీ కూడా ఇవ్వబోతున్నాడు. మిత్రులతో కలిసి ఈమధ్యనే థాయ్ లాండ్ వెళ్లాడు' అని ఈషా చెప్పుకొచ్చింది. ఈషా సైతం తన బంధువులు, మిత్రులను పెళ్లికి ఆహ్వానిస్తూ, వివాహానికి ముందు లంచ్ లు, డిన్నర్లతో సందడిగా ఉంది. పెళ్లి అంటే ఎవరికైనా ఎగ్జయిట్ మెంట్ ఉంటుందనీ, తాను కూడా ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాననీ ఇషా నవ్వుతూ చెప్పింది. ప్రస్తుతం తాను 'హల్లో డార్లింగ్', టరైట్ య రాంగ్', 'శబరి' చిత్రాల్లో నటిస్తున్నాననీ, వివాహానికి ఇదే మంచి తరుణంగా తామిద్దరూ భావించామనీ చెప్పుకొచ్చింది. నవంబర్ 26వ తేదీన ముహూర్తం బాగుందని శాస్త్ర పండితులు చెప్పినప్పటికీ, ముంబై చరిత్రలో 26/11 బ్లాక్ డే గా నిలిచిపోతుందని భావించి 29న వివాహానికి నిశ్చయించినట్టు ఈషా తెలిపింది. టిమ్మీ విశాల హృదయుడనీ, వివాహం తర్వాత కూడా తాను సినిమాల్లో నటించడానికి అతనికెలాంటి అభ్యంతరాలు లేవనీ చెప్పింది.
News Posted: 4 November, 2009
|