శిల్పా వివాహం 22న
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/shilpa-raj2.jpg' align='right' alt=''>బాలీవుడ్ ప్రముఖ నటి శిల్పాశెట్టి వివాహ ముహూర్తం నిశ్చయమైంది. ఈనెల 22వ తేదీన మంగలోరియన్ సాంప్రదాయ రీతిలో రాజ్ కుంద్రాతో మెడలో మూడు ముళ్ల వేయించుకోనుంది. పెళ్లికొడుకు రాజ్ కుంద్రా గుర్రం ఎక్కి పెళ్లి వధువు వద్దకు చేరుకోవడం కాకుండా ప్రత్యేకంగా తయారు చేయించిన రథంలో ఊరేగి శిల్పా చెంతకు చేరుకుంటారు. పెళ్లి దుస్తులను తరుణ్ తిహిలియానీ డిజైన్స్ చేస్తున్నారనీ, ఇంతవరకూ బాలీవుడ్ లో ఏ పెళ్లికూతురు ఈ తరహా పెళ్లి దుస్తులు ధరించలేదనీ శిల్పా సన్నిహిత వర్గాలు తెలిపాయి.
వివాహానికి హాజరయ్యే అతిథుల జాబితాను కూడా శిల్పా, రాజ్ కుంద్రా కుటుంబాలకే పరిమితం చేయనున్నారు. రాజ్ తల్లిదండ్రులు, ఆయన సోదరి ఏ నిమిషంలోనైనా లండన్ నుంచి చేరుకుంటారు. లూధియానా, అమృత్ సర్ లోని ఆయన బంధువులు పెళ్లికి కొద్ది ముందుగా అక్కడకు చేరుకుంటారు. మంగలోరియన్ కమ్యూనిటీలో అనుసరించే బంట్ సంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరుగనుంది. తొలుత తన సోదరి లేకుండా వివాహం చేసుకునేది లేదని శిల్పా ఇటీవల ప్రకటించింది. అయితే ప్రముఖ జ్యోతిష్యులను శిల్పా తల్లి సంప్రదించినప్పుడు ఇప్పడు శుభముహూర్తం కాదంటే ఏప్రిల్ 2010 వరకూ మంచి ముహూర్తాలు లేవని తేల్చిచెప్పారు. అయితే షమిత ఇప్పుడు 'బిగ్ బాస్' రూమ్ నుంచి బయటకు రాబోతున్నారు. శిల్పా సైతం ఇండో చైనీస్ ప్రొడక్షన్ 'డిజైర్' చిత్రం కోసం హైద్రాబాద్ లో జరిగే షూటింగ్ లో పాల్గొనవలసి ఉందట. ఒకసారి కమిట్ మెంట్ అయితే దానికి కట్టుబడి ఉండాల్సిందేనని శిల్ప సైతం భావిస్తోందనీ, అయితే పెళ్లి ముహూర్తానికి ఆమె కమిట్ మెంట్ అవాంతరం కాబోదనీ ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
News Posted: 6 November, 2009
|