శ్రియ స్కూబా డైవింగ్
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/shriya7.jpg' align='right' alt=''>ఎప్పుడూ షూటింగ్ లతో బిజీగా ఉండే నటీనటులు కాస్తంత రిక్రియేషన్ కోరుకోవడం సహజం. దక్షిణాది చిత్రాలతో పాటు హిందీ, హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించిన అందాల నటి శ్రియ గత వారమంతా అండమాన్ నికోబార్ దీవుల్లోనే గడిపింది. నిజానికి విహారం కోసం ఆమె అక్కడుకు వెళ్లలేదు. స్కూబా డైవింగ్ నేర్చుకోవాలనే తపనే ఆమెను పోర్ల్ బ్లెయిర్ కు తీసుకువెళ్లింది. ఈలోపు శ్రియ కనిపించకుండా పోయిందంటూ ఓ ఆసక్తికరమైన చర్చ కూడా మొదలైంది. ఈ చర్చ ముగిసేలోగానే శ్రియ అక్కడ్నించి తిరిగొచ్చి ఈ వారం రోజులూ అండమాన్ దీవుల్లోనే ఉన్నట్టు నవ్వుతూ చెప్పింది.
సాగర జలాల్లో స్కూబా డైవింగ్ నేర్చుకోవడం అంటే ఓ కొత్త అనుభూతిని సొంతం చేసుకున్నట్టే. ఇదో సాహస ప్రక్రియ. శిక్షకుల వద్ద స్కూబా డైవింగ్ నేర్చుకుంటుంటే చాలా తమాషాగా, మరో లోకంలోకి వెళ్లినట్టు అనిపించింది. పగడం, ముత్యాల చిప్పలు చూస్తుంటే ఓహ్ ... మార్వెలెస్ ఎక్స్ పీరియన్స్. ఈ శిక్షణ అనుకున్నంత తేలిక కానప్పటికీ చాలా థ్రిల్లింగ్ కలిగించింది...అంటూ చేపల్లాంటి కళ్లను మిటకరిస్తూ శ్రియ చెప్పుకొచ్చింది. ఈ అందాల సాగరకన్యను చూసి చేపలు, ఇతర జలచరాలకు కూడా కన్నుకుట్టే ఉంటుంది.
News Posted: 10 November, 2009
|