కత్రిన...వాట్ హ్యాపెన్స్!
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/katrina7.jpg' align='right' alt=''>ఇవాల్టి తరం నటీనటులు కెరీర్ ప్లానింగ్ తో పాటు లాంగ్ రన్ కూడా కోరుకుంటున్నారు. ఎక్కువ కాలం పరిశ్రమలో నిలబడేందుకు పలువురు సొంత బ్యానర్ పై చిత్రనిర్మాణాల వైపూ దృష్టిసారిస్తున్నాయి. బాలీవుడ్ లో నెంబర్ వన్ రేసులో పోటీపడుతూ పలు చిత్రాల్లో బిజీగా ఉన్న కత్రినా కైఫ్ వీలువెంబడి నిర్మాతగా కూడా మారాలనే యోచనలో ఉంది. ఇందులో భాగంగానే హాలీవుడ్ లో విజయవంతమైన 'వాట్ హ్యాపెన్స్ ఇన్ వెగాస్' చిత్రం రీమేక్ రైట్స్ సొంతం చేసుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. టామ్ వాగాన్ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ చిత్రంగా 2008లో 'వాట్ హ్యాపెన్స్..' విడుదలైంది. దీనిని హిందీలో రీమేక్ చేయాలనీ, ఒరిజనల్ వెర్షన్ లో కేమరాన్ పోషించిన పాత్రను తాను పోషించాలని కత్రిన పట్టుదలగా ఉంది.
'వాట్ హ్యాపెన్స్..' చిత్ర నిర్మాతలతో కత్రినా చర్చలు జరుపుతున్న విషయంపై మాత్రం కత్రినా ఇంకా పెదవి విప్పలేదు. ఇందుకు కారణాలు లేకపోలేదనీ, కత్రిన గతంలో ఓ ఫ్రెంచ్ ఫిల్మ్ కొనాలని అనుకున్నప్పటికీ ఆ విషయం బయటకు పొక్కడంతో డీల్ బెడిసికొట్టిందనీ, ఇప్పుడు మళ్లీ అలాంటి పొరపాటు చేయాలని కత్రిన అనుకోవడం లేదనీ ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అన్నీ సజావుగా జరిగి ఆంగ్ల చిత్రం రైట్స్ కత్రినకు దక్కితే హీరో పాత్ర ఎవరికి దక్కుతుందో చూడాల్సి ఉంది.
News Posted: 11 November, 2009
|