నాకేంటి...పెళ్లేంటి?!
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/Katrina23.jpg' align='right' alt=''>ముంబై: సల్మాన్ ఖాన్ గాళ్ ఫ్రెండ్, బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కు ఇండోర్ కు చెందిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రమేష్ మెండోలాతో పెళ్లయినట్టు తెలిపే ఓ మ్యారేజ్ సర్టిఫికెట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటికే ఆ సర్టిఫికేట్ తాము జారీ చేయలేదనీ, అది పూర్తిగా నకిలీదని ప్రకటించింది. కత్రినా సైతం తన పెళ్లి వార్తలపై తీవ్రంగా విరుచుకుపడింది.
ఇదొక నకిలీ మ్యారేజ్ సర్టిఫెకెట్ అనీ, తానింతవరకూ ఎవర్నీ పెళ్లి చేసుకోలేదనీ, సర్టిఫికెట్ లో ఉన్నట్టు చెబుతున్న వ్యక్తి ముఖం కూడా తానెప్పుడూ చూడలేదనీ కత్రిన వివరణ ఇచ్చింది. పోలీసులు తనను కలిసి సదరు వ్యక్తి నకిలీ సర్టిఫికెట్ ఇష్యూ చేశాడనీ, అతనిపై తగిన చర్య తీసుకుంటామని చెప్పారనీ ఆమె పేర్కొంది. జనాల్లో పాపులారిటీ ఉన్న వ్యక్తులను ఎంచుకుని ఇలాంటి సిల్లీ పనులకు కొందరు పాల్పడుతుంటారనీ, తాను ఆ వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని చెబుతున్న డిసెంబర్ 2వ తేదీన తాను 'న్యూయార్క్' చిత్రం కోసం న్యూయార్క్ లో జరిగిన షూటింగ్ లో ఉన్నాననీ చెప్పుకొచ్చింది. నటి జూహీచావ్లా వద్ద గతంలో పనిచేసిన స్టాఫ్ ఇప్పుడు తనతో పనిచేస్తున్నారనీ, గతంలో జూహీచావ్లా కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నట్టు వారు తనకు తెలిపారనీ పేర్కొంది. కత్రిన మరోవైపు తన తాజా చిత్రం 'అజబ్ ప్రేమ్ కి గజబ్ కహాని' బాక్సాఫీస్ ను ఆకట్టుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. ఇంత మంచి సక్సెస్ వస్తుందని తాను అనుకోలేదనీ, తన కెరీర్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన చిత్రాల్లో 'అజబ్...' కూడా ఒకటని ఆమె చిరునవ్వులు చిందించింది.
News Posted: 11 November, 2009
|