రేప్ కేసులో బండార్కర్ దోషి
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/preetijain-madhur.jpg' align='right' alt='Preeti jain-Madhur Bhandarkar'>ముంబై: మోడలింగ్ నుంచి నటిగా మారిన ప్రీతి జైన్ పై అత్యాచారం కేసులో ప్రముఖ దర్శకుడు మాధుర్ బండార్కర్ ను సిటీ కోర్టు దోషిగా నిర్దారించింది. ప్రీతి జైన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఐదేళ్ల తర్వాత ఈ తీర్పు వచ్చింది.
ప్రీతి జైన్ 2004లో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో 1999 నుంచి 2004 వరకూ 16 సార్లు తామిద్దరూ సెక్స్ లో పాల్గొన్నట్టు పేర్కొంది. తన చిత్రాల్లో కథానాయిక పాత్ర ఇస్తానని బండార్కర్ తనకు మాటిచ్చాడనీ, అయితే తనకు ఏ సినిమాలోనూ అవకాశమివ్వలేదనీ ఆమె తెలిపింది. తాను ప్రతిఘటించినప్పుడల్లా తనపై అతను అత్యాచారం చేశాడని ఆమె పేర్కొంది. బండార్కర్ ఐదేళ్లలో 'చాంద్ నీ బార్', 'సత్తా', 'అయన్' అనే మూడు చిత్రాలు తీసిన విషయం తనకు తెలుసనీ, ఏ ఒక్క సినిమాలోనూ తనను ఆయన తీసుకోలేదనీ, విడుదలకు సిద్ధంగా ఉన్న 'పేజీ 3'లోనూ తాను లేనని మాధుర్ పై కేసు నమోదు చేసిన సమయంలో మీడియాతో జైన్ చెప్పింది. తనను పెళ్లి చేసుకుని స్టార్ ను చేస్తానని కూడా బండార్కర్ వాగ్దానం చేసినట్టు కూడా పేర్కొంది.
News Posted: 11 November, 2009
|