ఓంపురి చిలక్కొట్టుడు!
ఇండియన్ సినిమా గురించి, ముఖ్యంగా ఆర్ట్ సినిమాల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఓంపురి పేరు ఠక్కున్న గుర్తొస్తొంది. 'అక్రోష్', 'అర్ధ్ సత్య', నిన్నమొన్నటి 'ఎ వెన్స్ డే' వంటి చిత్రాలు ఆయనలోని వైవిధ్యమైన నటుడికి దర్పణం పడతాయి. పలు హాలీవుడ్ చిత్రాల్లోనూ ఆయన నటించి మెప్పించారు. 'పద్మశ్రీ' సైతం ఆయనను వరించింది. ఆయన ఎంత విలక్షణ నటుడైనా నిజ జీవితంలో ఆయనకు కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయట. ఆ బలహీనతలు ఏమిటో ఆమె బార్య నందిత ఇప్పుడు బయట ప్రపంచానికి చెప్పడంతో ఓంపురి గుర్రుమంటున్నారట.
జర్నలిస్టు కూడా అయిన నందిత ఇటీవల 'అన్ లైక్లీ హీరో' అంటూ ఓంపురి జీవిత చరిత్ర రాశారు. ఇందులో ఆమె ఓంపురి 'రాసలీలలు' కూడా చెప్పుకొచ్చారు. ఓంపురి తన 14వ ఏట శాంతి అనే పనిమినిషితో లైంగిక సంబంధం పెట్టుకున్నారనీ, లక్ష్మి అనే మరో పనిపిల్లతోనూ ఆయన శృంగార కలాపాలు సాగించారనీ ఆమె ఇందులో పేర్కొన్నారు. ఓంపురి జీవితంలో ఈ రెండు సంఘటనలు యాదృచ్ఛికంగా సంభవించినవే కావచ్చని అన్నారు. భర్త బలహీనతలను ఇలా పబ్లిక్ గా...అది కూడా 'బయోగ్రఫీ'లో డప్పు వేయడం ఏమిటంటూ 64 ఏళ్ల ఓంపురి ఇప్పుడు ఆమెపై మండిపతున్నారట.
News Posted: 13 November, 2009
|