కత్రినా నైట్ కు 2 కోట్లు!
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/katrina-kaif-.jpg' align='right' alt=''>'న్యూ ఇయర్ ఈవ్' వస్తోందంటో బాలీవుడ్ టాప్ హీరోయిన్లకు పండుగే. వరల్డ్ క్లాస్ హోటల్స్ లో జరిగే న్యూ-ఇయర్ పార్టీల్లో పెర్ ఫారమెన్స్ కు వీరు అదనపు గ్లామర్ జోడించి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. ఇందుకు గాను నిమిషానికి లక్షల చొప్పుల లెక్కేసి నిర్వాహకులు వారికి ముట్టజెబుతుంటారు. బాలీవుడ్ ను వరుస విజయాలతో ఏలుతున్న కత్రినా కైఫ్ గత ఏడాది ఈ అవకాశం జారవిడుచుకున్నప్పటికీ ఈ డిసెంబర్ 31 'మిడ్ నైట్'ను మాత్రం వదులుకోవడం లేదట. అది కూడా గత ఏడాది కంటే ఒక కోటి రూపాయలు ఎక్కువ కూడా ఈసారి డిమాండ్ చేస్తోందట.
జె.జె.మారియట్ లో న్యూయర్ ఈవ్ పార్టీ కోసం గత ఏడాది కత్రినకు కోటి రూపాయలు ఆఫర్ ఇచ్చారనీ, ఇప్పుడు ఆ మొత్తం 2 కోట్లు వరకూ ఉంటుందనీ ఈవెంట్ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది 26/11 టెర్రరిస్టు దాడుల నేపథ్యంలో ముంబైలో న్యూఇయర్ ఈవెంట్ కు ఎవరూ ఆసక్తి చూపలేదు. ముందుగా అనుకున్న ఈవెంట్లు కూడా రద్దయ్యాయి. ఈ ఏడాది మళ్లీ కత్రినను న్యూఇయర్ ఈవెంట్ చేయాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారనీ, ఇందుకు కత్రినా ఇందుకు సముఖంగానే ఉందనీ, అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో తనకున్న పొజిషన్ ను దృష్టిలో పెట్టుకుని భారీ మొత్తం ఆశిస్తోందనీ పలువురు చెబుతున్నారు. కత్రిన రీసెంట్ గా 'అజబ్ ప్రేమ్ కీ...' చిత్రంతో మరో పెద్ద హిట్ ను కూడా తన ఖాతాలోకి వేసుకుంది. పెరిగిన ఇమేజ్, క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుంటే కత్రిన 2 కోట్లు అడగడంలో ఏమాత్రం ఆశ్యర్య పోనవసరం లేదు మరి...
News Posted: 14 November, 2009
|