పబ్లిషర్స్ పై ఓంపురి గుస్సా
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/ompuri-nandita.jpg' align='right' alt='Ompuri-nandita'>విలక్షణ నటుడు ఓంపురి తన వ్యక్తిగత జీవితంలోని 'రాసలీల'లను 'అన్ లైక్లీ హీరో: ది స్టోరీ ఆఫ్ ఓంపురి' అనే బయోగ్రఫీలో తన భార్య నందిత బయటపెట్టడంతో కొద్దిరోజులుగా అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. తొలుత 'ఆమె నా భార్య అయినప్పటికీ ఆమెను నిలదీయక మానను' అని ఓంపురి వ్యాఖ్యానించారు. తన బయోగ్రఫీ గురించి ఓ టీవీలో నందిత చెప్పిన విషయాలు తనను దిగ్భ్రాంతికి గురిచేశాయనీ, రాసలీలలు సాగించడం ఏదో ఘనకార్యంగా చెప్పడం ఏమిటని ఆయన మనస్థాపం వ్యక్తం చేశారు.
ఓంపురి తన 14 ఏట శాంతి అనే పనిమనిషితో లైంగిక సంబంధం పెట్టుకున్నారనీ, లక్ష్మి అనే మరో పనిపిల్లతోనూ ఆయన శృంగార కలాపాలు సాగించారనీ ఈ బయెగ్రఫీలో నందిత ఓంపురి చెప్పుకొచ్చారు. దీనిపై ఓంపురి వ్యాఖ్యానిస్తూ 'నా జీవితంలోని ముఖ్యమైన అంశాలను ఆమె గాసిప్ స్థాయికి దిగజార్చారు. ఆనాటి చీకటి కోణాలను అందరి భర్తల్లాగానే నేను కూడా ఆమెతో మనసువిప్పి చెప్పాను'అన్నారాయన. అసలేం జరిగిందంటూ ఇప్పుడు నందితకు లెక్కకు మించిన ఎస్ఎంఎస్ లు వస్తున్నాయనీ, తన కొడుకు అయితే ఫోనులోనే వెక్కివెక్కి ఏడుస్తుండటం దయనీయ పరిస్థితిని తలపిస్తోందనీ ఆయన వాపోయారు. ఈ పరిణామాలతో తన కంటికి నిద్ర దూరమైందనీ, పనిమీద కూడా దృష్టి సారించలేకపోతున్నాననీ అన్నారు. 'నేను చేసిన తప్పిదాలకు మా కొడుకు బాధపడకూడదు' అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో బుక్ పబ్లిసిషర్లు అతిగా వ్యవహరించారని మండిపడ్డారు. 'పుస్తకం అమ్మకాలకు ముందే సెక్సువల్ ఎపిసోడ్లను లీక్ చేయడం ద్వారా వాళ్లు ప్రీ పబ్లిసిటీ ఆశించారు. నా కథకు ఈతరహా పబ్లిసిటీ ఎంతమాత్రం అవసరం లేదు' అని ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు.
News Posted: 16 November, 2009
|