కరీనా కపూర్ తన బాయ్ ఫ్రెండ్ సైఫ్ అలీఖాన్ కు ఇకముందు ఎస్.ఎం.ఎస్.లు పంపాలంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పేలా లేదు. 'స్టార్ మజా' అనే మరాఠీ ఛానెల్ కోసం మీడియాతో కరీనా ఇటీవల సమావేశమైనప్పుడు ఆమె తన బాయ్ ఫ్రెండ్ కు పంపిన మెసేజ్ లు కెమెరా కంటికి చిక్కాయి. ఆమె ఫోను వైపు కెమెరా జూమ్ కావడంతో ఆమె పంపిన మెసేజ్ లు రికార్డ్ అయిపోయాయి. కరీనా తేరుకునేలోపే కొంత డ్యామేజీ కూడా జరిగిపోయింది.
తొలుత కరీనా ఒంటరిగా ఓ చైర్ లో కూర్చిన కాఫీ సిప్ చేస్తూ టెక్స్ట్ మెసేజ్ లు పంపడం మొదలుపెట్టింది. అయితే కెమెరా తన ఫోన్ కు జూమ్ చేసి ఉందని కానీ, మెసేజ్ లు రికార్డు అవుతున్నాయని కానీ కరీనాకు తెలియనే తెలియదు. జూమింగ్ పూర్తయిన తర్వాత తేలిన విషయం ఏమిటంటే...కరీనా తన మెసేజ్ లలో సైఫ్ కు చీవాట్లు పెడుతోంది. సైఫ్ మెసేజ్ 'సారీ బేబీ...వజ్ టాకింగ్ అబౌట్ యువర్ రోల్ ఓన్లీ' (నీవు పోషించే పాత్ర విషయమే మాట్లాడుతున్నాను...సారీ బేబీ) అంటూ సాగింది. ఇందుకు 'యు ఆర్ ర్యూడ్, సైఫ్! ఐ యామ్ హర్ట్' (నువ్వు పరుషంగా మాట్లాడుతున్నావు సైఫ్! నా మనసు గాయమైంది) అంటూ కరీనా రిప్లయ్ ఇచ్చింది. ఈ సంభాషణలను బట్టి చూస్తే ఇద్దరి మధ్యా ఏదో ఒక విషయంలో జగడం మొదలైందని నిశ్చయంగా చెప్పొచ్చు. ఈ విషయమై సదరు ఛానెల్ రిపోర్టర్ మాట్లాడుతూ 'కరీనా ఫోనులోకి కెమెరా జూమ్ కావడం యాదృచ్ఛికంగా జరిగినదే. మెసేజ్ టైపింగ్ చేస్తున్న కరీనా ఆ విషయం గ్రహించి కెమెరామన్ ను షూట్ చేయవద్దని చెప్పింది. సైఫ్-కరీనా మధ్య గొడవ ఏదో జరుగుతోందనేది మాత్రం స్పష్టం. సైఫ్ స్వీట్ మెసేజ్ లు పంపుతూ ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు' అంటూ చెప్పుకొచ్చారు. పబ్లిక్ లోకి వచ్చినప్పుడు బాహ్యప్రపంచం మర్చిపోయి ప్రవర్తిస్తే ఇలాంటి చిక్కులు తప్పవని కరీనాకు తెలిసొచ్చిందో లేదో మరి..