మణి-సుహాసిని ర్యాంప్ వాక్
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/Mani-suhasini.jpg' align='right' alt=''>భారతదేశం గర్వించదగిన దర్శకులలో ఒకరైన మణిరత్నం తన సతీమణి, ప్రముఖ నటి అయిన సుహాసినితో కలిసి తొలిసారి ర్యాంప్ వాక్ చేయబోతున్నారు. ఇది కూడా సామాజిక ప్రయోజనం కోసం చేపట్టిన ఓ కార్యక్రమం కోసం కావడం విశేషం. 'ఆడ శిశువులను కాపాడండి' అంటూ జరుపుతున్న ప్రచార కార్యక్రమానికి తమవంతు మద్దతుగా ఈ ర్యాంప్ షోలో ఈ దంపతులు పాల్గొనబోతున్నారు. డిజైనర్ సంజన జాన్ ఈ షో నిర్వహిస్తున్నారు.
'మణిరత్నం, ఆయన సతీమణి సుహాసిని ఈ ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకు అంగీకరించారు' అంటూ సంజన సంబరంగా చెప్పారు. 'సేవ్ గర్ల్ చైల్డ్' క్యాంపైన్ తో ఇటీవల ఢిల్లీలో తాము ఒక షో నిర్వహించామనీ, తదుపరి షో చెన్నైలో ప్లాన్ చేస్తున్నామనీ తెలిపారు. ఈ షోలో పాల్గొనాల్సిందిగా పలువురు బాలీవుడ్ హీరోలను కూడా సంప్రదిస్తున్నామనీ, చెన్నైలో ఈసారి నిర్వహిస్తుండటం వల్ల పలువురు దక్షిణాది నటులు కూడా ఇందులో పాల్గొంటారనీ చెప్పారు. హృతిక్ రోషన్ సైతం ర్యాంప్ వాక్ లో పాల్గొనే అవకాశముందని తెలిపారు.
News Posted: 18 November, 2009
|