సల్మాన్ చెంప చెళ్!
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కు నోటిదురుసు ఎక్కువనీ, మహిళలను గౌరవించడం ఆయన నైజం కాదనీ బాలీవుడ్ లో ఓ అపప్రద ఉంది. అయితే సల్మాన్ ఎంతో సహృదయుడనీ, ఇవన్నీ ఆయనపై పుట్టించిన కట్టుకథనాలేననీ ఆయనతో సన్నిహితంగా ఉండేవారు చెబుతుంటారు. సల్మాన్ దుందుడుకుతనం తెలిసిన వారెవరెనా ఆమెను ఓ అమ్మాయి చెంపదెబ్బకొట్టినప్పటికీ ఆయన పెదవి విప్పకుండా సైలైంట్ గా అక్కడి నుంచి నిష్క్రమించారంటే నమ్మగలరా? అయితే జరిగిందదే. సల్మాన్ జెంటిల్ మన్ బివేహియర్ కు ఈ సంఘటన అద్దంపడుతుంది కూడా.
సల్మాన్ ను ఓ కిలాడీ అమ్మాయి చెంపదెబ్బ కొట్టడమనే షాకింగ్ ఇన్సిడెంట్ ఇటీవల ఢిల్లీలోని ఓ ప్రైవేట్ పార్టీలో జరిగింది. సల్మాన్ ప్రైవేట్ పార్టీలోకి చొరబడిన ఓ ప్రముఖ బిల్టర్ కుమార్తె మోనిక తప్పతాగిన మైకంలో సల్మాన్ చెంప వాయగొట్టింది. అయితే సల్మాన్ ఎంతో కూల్ గా ఆ అమ్మాయిని గేటుబయటకు పంపించాల్సిందిగా సెక్యూరిటీ సిబ్బందికి చెప్పి అక్కడ్నించి నిష్క్రమించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, సంజన జాన్ ఫ్యాషన్ షో అనంతరం ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో పార్టీ జరిగింది. సల్మాన్, అతని సోదరుడు సొహైల్ ఖాన్, సుస్మితాసేన్, ఆమె సోదరుడు రాజీవ్ సేన్, రైమా, రియాసేన్, అమాన్, అయాన్ అలి ఖాన్, షిబని కాస్యప్, బాక్సింగ్ చాంపియన్ విజేందర్ సింగ్, పలువురు బాలీవుడ్ ప్రముఖుడు ఇందులో పాల్గొన్నారు. తెల్లవారు జాము వరకూ పార్టీ కొనసాగింది. అయితే అప్పుడే అసలు డ్రామా మొదలైంది. మోనిక తప్పతాగిన మైకంలో తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి పార్టీ జరుగుతున్న చోటకు వచ్చి లోపలకు ప్రవేశించేందుకు ప్రయత్నించింది. తాగుడు మైకంలో అదుపుతప్పి బిగ్గరగా అరుస్తూ హంగామా సృష్టించడంతో ఎంట్రన్స్ గేట్ వద్ద ఉన్న సోహైల్ ఖాన్ ఆమెను లోపలకు రానీయవద్దని సెక్యూరిటీ గార్డులను ఆదేశించారు. ఏదో గడిబిడ జరుగుతోందని గ్రహించిన సల్మాన్ మోనికా ఉన్న చోటుకు వచ్చారు. ఇదే సమయంలో మోనిక నోటికొచ్చినట్టు సోహైల్, సుస్మితా సేన్ లపై తిట్లదండకం అందుకుంది. సల్మాన్ ఎంతో అనునయంగా అక్కడ్నించి వెళ్లాలని మోనికను కోరారు. దాంతో ఊహించని విధంగా మోనిక ఆయన చెంప చెళ్లుమనిపించింది. గార్డులు వెంటనే అప్రమత్తమై ఆమెను అక్కడ్నించి లాక్కుపోయారు. ఆశ్చర్యకరంగా సల్మాన్ చెంపదెబ్బ తిన్నప్పటికీ ఎంతో కూల్ గా వ్యవహరించడంతో పాటు సోహైల్ తో కలిసి అక్కడ్నించి నిష్కృమించారు. ఈ సంఘటనపై మోనికా బాయ్ ఫ్రెండ్ ను సంప్రదించినప్పుడు తాను ప్రస్తుతం ఒక మ్యారేజ్ ప్రోగ్రాంలో బిజీగా ఉన్నట్టు ఆయన సమాధానమిచ్చారు.
News Posted: 18 November, 2009
|