'రావి'కి గురజాడ పురస్కారం
విజయనగరం : ప్రముఖ సినీనటుడు, రచయిత రావికొండలరావు గురజాడ విశిష్ట పురస్కారాన్ని అందజేయనున్నాని గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి కాపు గంటి ప్రకాష్ ప్రకటించారు. నవంబర్ 30వ తేదీన జరిగే సభలో ఈ పురస్కారాన్ని అందజేస్తామన్నారు. కవులు, కళాకారులు ఆరోజున ఉదయం మహాకవి గురజాడ ఇంటి నుంచి ఊరేగింపుగా వెళ్ళి మహారాజా కళాశాల వద్ద ఉన్న గురజాడ విగ్రహాన్ని పూలమాలతో అంలకరిస్తారని, కన్యాశుల్కం నాటకం నుంచి ఒక సన్నివేశాన్ని ప్రదర్శిస్తారని వివరించారు. అలానే గురజాడ రచనలపై సదస్సు జరుగుతుందని చెప్పారు. ఈ సందర్బంగా పాఠశాలల విద్యార్థులకు తెలుగు భాష, గురజాడ రచనలపై వ్యాసరచన, నటన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తామని ఆయన వివరించారు.
ఇంతవరకు గురజాడ సాంస్కృతిక సమాఖ్య జేవీ సోమయాజులు, గొల్లపూడి మారుతీరావు, సినారె, కళాతపస్వి విశ్వనాథ్, గుమ్మడి, షావుకారు జానకి, ఎమ్మెస్ రెడ్డి, అంజలీ దేవులకు గురజాడ పురస్కారాలను అందజేసిందని చెప్పారు. దాదాపు ముప్పై సాహితీ, సాంస్కృతిక, సేవా సంస్థలు సమైఖ్యంగా గత ఎనిమిదేళ్ళుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు.
News Posted: 19 November, 2009
|