'కుర్బాన్' రిలీజ్ కు క్లియరెన్స్
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/kurbaan1.jpg' align='right' alt=''>ముంబై: సైఫ్ అలీ ఖాన్, కరీనాకపూర్ జంటగా రెన్సిల్ డిసిల్వ దర్శకత్వంలో కరణ్ జోహర్ నిర్మించిన 'కుర్బాన్' చిత్రం విడుదలపై స్టే ఇచ్చేందుకు ముంబై హైకోర్టు నిరాకరించింది. దీంతో ముందుగా అనుకున్న ప్రకారం ఈ శుక్రవారంనాడే 'కుర్బాన్' ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రంలో 'అసభ్యంగా' ఉన్నట్టు చెబుతున్న రెండు పాటలపై వివరణ ఇవ్వాల్సిందిగా కరణ్ జోహర్, సైఫ్, కరీనాలను కోర్టు ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను 2010 జనవరి 14వ తేదీకి చీఫ్ జస్టిస్ స్వతంత్ర కుమార్, జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్ లతో కూడిన డివిజన్ బెంచ్ వాయిదా వేసింది.
సినిమా విడుదలపై స్టే ఇవ్వాలనీ, అలా కాని పక్షంలో అభ్యంతరకరంగా ఉన్న రెండు పాటలనూ తొలగించి విడుదల చేయాలని పిటిషనర్ మహమ్మద్ అలి కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ రెండు అభ్యంతరాలను డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. ఈ చిత్రంలోని 'షుక్రాన్ అల్లా...', 'అలీ మౌలా' అనే రెండు సాంగ్స్ లో తప్పుదారిపట్టించే అభ్యంతకరమైన సాహిత్యం ఉండటాన్ని కోర్టు కూడా తీవ్రంగా పరిగణించిందనీ, దీనిపై దర్శకుడు డిసిల్వ, గేయరచయితలైన ఇర్ఫాన్ సిద్ధిఖ్, నిరంజన్ అయ్యంగార్ లను వివరణ కూడా కోరిందనీ ఆలీ తరపు న్యాయవాది ఎస్.కుంజురామన్ తెలిపారు. ఇదే పిటిషన్ తో త్వరలో తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని అలి తెలిపారు.
News Posted: 19 November, 2009
|