ప్రాణం కాపాడిన సల్మాన్
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/veer1.jpg' align='right' alt=''>సల్మాన్ సూపర్ ఫిజిక్, సకాలంలో ఆయన స్పందించిన తీరు ఓ నటుడి ప్రాణాన్ని కాపాడింది. సల్మాన్ కథానాయకుడుగా విజయ్ గిలానీ తీస్తున్న 'వీర్' చిత్రం షూటింగ్ లో సల్మాన్ తన సహనటుడు బన్నీ ఆనంద్ ను కాపాడి అతని పాలిటి దేవుడయ్యాడు. ఇటీవలే ఈ సంఘటన చోటుచేసుకుంది.
రైలు దోపిడీ ఘట్టాన్ని ఇటీవల రాజస్థాన్ లో దర్శకుడు చిత్రీకరించారు. సన్నివేశం పరంగా బన్నీ, నటుడు విక్కీ మెహ్రా తమ గుర్రాలపై స్వారీ చేస్తుండగా, సల్మాన్ రెండు గుర్రాలపై తలో కాలు పెట్టి స్వారీ చేయాల్సి ఉంది. సల్మాన్ చుట్టూ పలువురు గుర్రాలపై రైడ్ చేస్తుంటారు. దర్శకుడు అనిల్ శర్మ యాక్షన్ చెప్పగానే సల్మాన్ నిలబడి సాహసం చేస్తుంటే ఊహించని విధంగా బన్నీ పట్టుతప్పి తన గుర్రం నుంచి దాదాపు నేలనుతాకాడు. ప్రమాదం గ్రహించిన సల్మాన్ వెంటనే తన చేతులతో బన్నీని పట్టుకుని పైకి లైగారు. కన్నుమూసి కన్నుతెరచేంత సమయంలో సల్మాన్ స్పందించి ఉండకపోతే బన్నీ గుర్రం మీద నుంచి పడిపోయేవాడే. ఆ వెనుక బాణంలా దూసుకువస్తున్న గుర్రాల కాలికింద నలిగి ప్రాణాలు కోల్పోయి ఉండేవారే. ఈ సంఘటన తలుచుకున్నప్పడల్లా బన్నీ వెన్నులో చలిపుడుతోందట. సల్మాన్ భాయ్ తన జీవితాన్ని కాపాడనీ, ఆయనకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో తెలియడం లేదనీ బన్నీ ఎంతో ఉద్వోగంతో చెప్పుకొచ్చారు.
News Posted: 23 November, 2009
|