అమితాబ్ పై కస్సు..బుస్సు!
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/amitab4.jpg' align='left' alt=''>అభి(షేక్) నాకు తండ్రిగా నటించినా నన్ను మాత్రం దాటి (నటనలో) పోలేడు...అంటూ 'పా' చిత్రంలో 12 ఏళ్ల బాలుడిగా నటిస్తున్న నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ ఇటీవల నవ్వుతూ చెప్పారు. 67 ఏళ్ల అమితాబ్ ఇప్పటికీ నటనలో ఏమాత్రం తగ్గరనడానికి ఇది ఓ ఉదాహరణ మాత్రమే. అందుకే అమితాబ్ అంటే ఇష్టపడని వారెవరూ ఉండరు. అలాంటి అమితాబ్ కు కంపెనీ ఇవ్వాలనుకుందో ఏమో కానీ...ఈ మధ్య ఓ సర్పరాజు ఆయన రూములో దూరి కొద్దిసేపు హంగామా సృష్టించింది. అమితాబ్ స్వయంగా తన బ్లాగ్ లో ఈ విషయం చెప్పుకొచ్చారు.
అమితాబ్ ఒకరోజు ఉదయమంతా షూటింగ్ లో పాల్గొని ప్యాకప్ చెప్పిన తర్వాత తన రూమ్ లోకి వెళ్లి నిద్రలోకి జారుకున్నారు. అర్ధరాత్రి వేళ టాయెలెట్ కోసం లేచారు. అయితే అప్పుడు తన రూమ్ లో పాము ఉందనే విషయం ఆయనకు తెలియనే లేదు. టాయెలెట్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మాత్రమే పాము ఉనికిని ఆయన పసిగట్టారు. వెంటనే ఆయన సెక్యూరిటీ గార్డులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు రంగంలోకి దిగి ఎంతో నేర్పుగా ఆ పామును అక్కడ్నించి వెళ్లగొట్టారు. తన ప్రాణాలను కాపాడిన సెక్యురిటీ గార్డులకు, భగవంతుడికి అమితాబ్ కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఈ తతంగమంతా ఖండాలాలో 'బిగ్ బాస్-3' షూటింగ్ లో అమితాబ్ పాల్గొన్నప్పడు జరిగిందట.
News Posted: 24 November, 2009
|