అవన్నీ పుకార్లే : కత్రినా
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/kat1.jpg' align='right' alt=''>బాలీవుడ్ నెంబర్ వన్ రేసులో ఉన్న కత్రినా కైఫ్ ఒక ఫ్రెంచ్ ఫిల్మ్ రైట్స్ కొనుగోలు చేసి సొంతంగా చిత్ర నిర్మాణం చేయాలనే ఆలోచలో ఉన్నట్టు వస్తున్న వార్తలన్నీ కేవలం వదంతులేనట. అలాంటి ఆలోచన ఏదీ తనకు లేదని కత్రిన స్పష్టం చేసింది. నటిగా తన కెరీర్ ఇప్పుడు చక్కటి ట్రాక్ లో ఉందనీ, ఈ దశలో మరో వ్యాపకం పెట్టుకునే తీరిక ఎంతమాత్రం లేదనీ ఆమె తేల్చిచెప్పింది.
'ఇలాంటి వదంతులు ఎక్కడి నుంచి పుట్టుకు వస్తాయో తెలియదు. బహుశా గాలిలో నుంచి పుడతాయేమో? నేను మాత్రం అలాంటి ప్రయత్నాలు ఎప్పుడూ చేయలేదు' అంటూ చెప్పింది కత్రిన. ఫ్రెంచ్ చిత్రంలో కత్రిన పెళ్లయిన ఓ డాక్టర్ ను ప్రేమించే స్టూడెంట్ పాత్ర పోషించనుందనీ, గర్భవతి అయిన భార్యను వదలి వేయాలని కత్రిన అతన్ని కోరుతుందనీ, అయితే అతను మాత్రం అందుకు సముఖంగా ఉండడనీ, ఆ క్రమంలో జరిగే పరిణామాలే సదరు చిత్రకథ అనీ వార్తలు వచ్చాయి. దీనిపై కత్రినా స్పందిస్తూ, కథ చాలా ఇంట్రస్టింగ్ గా ఉందనీ, అయితే ఈ కథతో చిత్ర నిర్మాణానికి సంబంధించిన వార్తలన్నీ కేవలం ఊహాగానాలేననీ కొట్టిపారేసింది. ప్రస్తుతం 'అజబ్ ప్రేమ్ కి గజబ్ కహాని' చిత్రం సాధించిన ఘనవిజయాన్ని తాను ఆస్వాదిస్తున్నాననీ, మళ్లీ మంచి అవకాశం వస్తే రణ్ బీర్ తో నటించేందుకు కూడా సిద్ధమేననీ తెలిపింది. కత్రినకు ఈవారం కూడా చాలా కీలకం కాబోతోంది. కత్రినా, అక్షయ్ కుమార్ కాంబినేషన్ కు హిట్ పెయిర్ గా పేరుంది. అందుకు తగ్గట్టే ఈ ఇద్దరూ కలిసి ప్రియదర్శన్ దర్శకత్వంలో నటించిన 'దే దనా దన్' చిత్రం ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజమే మరి...కత్రిన కెరీర్ ఇంత స్పీడ్ గా ఉన్నప్పుడు నిర్మాతగా 'జూదం' ఆడాలని ఎందుకనుకుంటుంది?!
News Posted: 24 November, 2009
|