కత్రినకు కామెర్లు
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/katrinakaif7.jpg' align='right' alt=''>ముంబై: బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ పచ్చకామెర్ల (జాండీస్) బారిన పడ్డారు. దీంతో వైద్యులు కొద్దిరోజుల పాటు ఆమెను విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న 'దే దనా దన్' చిత్రం ప్రమోషన్ వర్క్ లో కత్రిన పాల్గొనవలసి ఉన్నప్పటికీ దానికి దూరంగానే ఉండిపోయారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ కు జోడిగా కత్రిన నటించారు.
కొద్దిరోజులుగా ఒంట్లో నీరసంగా ఉన్న కత్రినా ఆదివారంనాడు మంచం నుంచి కూడా లేవలేకపోయిందనీ, దీంతో ఆమె డాక్టర్ ను సంప్రదించారనీ వార్తలు వచ్చాయి. కత్రిన ఇటీవల జరిగిన ఓ ప్రమోషన్ వర్క్ లోనూ పాలిపోయినట్టు నీరసంగా కనిపించిందనీ, దీంతో ఆమె వైద్యులను సంప్రదించారనీ తెలుస్తోంది. మరి కొద్ది రోజుల పాటు ఎక్కడికీ కదలకుండా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
News Posted: 25 November, 2009
|