శిల్పా మ్యారేజ్ రెసెప్షన్

ఖండాలాలోని విల్లాలో పంజాబీ సాంప్రదాయ ప్రకారం ఆదివారంనాడు జీవిత భాగస్వాములైన శిల్పాశెట్టి, రాజ్ కుంద్ర దంపతులు ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్ లో మంగళవారం రాత్రి గ్రాండ్ రెసెప్షన్ ఇచ్చారు. ఈ వేడుకలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.
శిల్పా-రాజ్ ల పెళ్లి మాత్రం ఇరు కుటుంబాలకు చెందిన సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే జరిగింది. పరిశ్రమ నుంచి సన్నీడియోల్, సునీల్ శెట్టి, వాసు భగ్నానీ వంటి కొద్ది మంది మాత్రమే అందులో పాల్గొన్నారు. ఇందుకు భిన్నంగా ఈ దంపతులు ఇచ్చిన మ్యారేజ్ రెసెప్షన్ బాలీవుడ్ తారలతో సందడి సృష్టించింది. శిల్పా చెల్లెలు షమితా శెట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమితాబ్ బచ్చన్ తన కోడలు ఐశ్వర్యారాయ్ తోనూ, షారూక్ తన సతీమణి గౌరితోనూ, హృతిక్ రోషన్ సుసానే తోనూ కలిసి రావడంతో సందడి వాతావరణం ఏర్పడింది. గోవిందా తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. అమీషా పటేల్, రేఖ, జయప్రద, సమీరారెడ్డి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. శిల్పా మెహందీ అండ్ సంగీత్ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ కు కు ఆహ్వానం అందినప్పటికీ షూటింగ్ లో బిజీగా ఉన్న కారణంగా ఆయన హాజరుకాలేకపోయారు. వివాహ రెసెప్షన్ కు అక్షయ్ కుమార్, ఆయన సతీమణి ట్వింకిల్ ఖన్నా సైతం దూరంగా ఉన్నారు. అతిథుల జాబితాలో అక్షయ్ పేరు లేకపోవడమే ఇందుకు కారణం.
News Posted: 25 November, 2009
|