ఓంపురి బయోగ్రఫీ ఆవిష్కరణ

ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు ఓంపురి జీవిత చరిత్రపై జర్నలిస్టు అయిన ఆయన భార్య నందిత రాసిన 'ఓంపురి బయోగ్రఫీ-అన్ లైక్లీ హీరో' పుస్తకాన్ని బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఆవిష్కరించారు. ఈ బయోగ్రఫీలో ఓంపురి జీవితంలోని పలు అంశాలతో పాటు ఆయన సెక్యువల్ ఎన్ కౌంటర్స్ ను కూడా నందిత వెల్లడించిందనే వార్తలు ఇటీవల సంచలనం సృష్టించాయి.
ఓంపురి 14 ఏళ్ల వయసులోనే ఓ పనిమనిషితో అక్రమ సంబంధం పెట్టుకున్నారనీ, ఆ తర్వాత మరో పనిమనిషితో ఆయన ఎక్కువకాలం లైంగిక సంబంధాలు కొనసాగించారనీ నందిత ఈ బయోగ్రఫీలో పేర్కొన్నారు. సహజంగానే నందిత వెల్లడించిన అంశాలపై ఓంపురి మనస్థాపం చెందినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆయన కొంత స్థిమితపడి బయోగ్రఫీ రిలీజ్ కాకుండానే ఈ విషయాలు లీక్ అయినందకు పబ్లిషర్లపై మండిపడ్డారు. 'అన్ లైక్లీ హీరో' ఆవిష్కరణ అనంతరం అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను ధైర్యంగా వెల్లడించిన ఓంపురిని మెచ్చుకుని తీరాలని అన్నారు. తన జీవితంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలను ఓంపురి ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో నందితా ఓంపురితో పాటు ఓంపురి దంపతుల కుమారుడు (11 ఏళ్లు) కూడా పాల్గొన్నారు.
News Posted: 25 November, 2009
|