ఇస్కాన్ లో ఇషా పెళ్లి
ముంబై: బాలీవుడ్ భామ ఇషా కొప్పికర్ (33), రెస్టారెంట్ వ్యాపారి టిమ్ నారంగ్ ల వివాహం ఆదివారంనాడు సంప్రదాయబద్ధంగా జరిగింది. జుహూలోని ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్సియస్ నెస్ (ఇస్కాన్) ఆలయంలో మహారాష్ట్ర సంప్రదాయ పద్ధతిలో నిరాడంబరంగా ఈ వివాహం జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులు, సన్నిహతులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
'ఎంతో ఉద్విగ్న క్షణాలివి. ఇషా తో ఎప్పుడెప్పుడు పెళ్లవుతుందా అని ఎదురుచూస్తున్నాను' అంటూ వివాహ మండపానికి వెళ్లే ముందు నారంగ్ వ్యాఖ్యానించారు. నాలుగు గంటల పాటు వివాహం జరిగిందనీ, ఇషా ఎరుపు, పసుపు రంగు కలిసిన చీర, నారంగ్ క్రీమ్ కలర్ షేర్వానీ ధరంచారనీ ఆలయ అధికారి ఒకరు తెలిపారు. పెళ్లికి పురోహితులను మాత్రం వారే తెచ్చుకున్నారనీ, హాలు, ఆహార సదుపాయం తాము కల్పించాలనీ ఆయన చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ఇస్కాన్ హాలు బుక్ చేసుకున్నారనీ, 11 గంటల శుభముహూర్తంలో ఇషా మెడలో నారంగ్ మూడుముళ్లు వేశారనీ తెలిపారు. పలి హిల్ లోని నారంగ్ ఇంట్లో రాత్రి 9 గంటలకు కొత్త దంపతులు రెసెషన్స్ ఇచ్చారు.
News Posted: 30 November, 2009
|