ఎయిడ్స్ చిన్నారుల దత్తత
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/Kamalhasan1.jpg' align='right' alt=''>చెన్నై: ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న 'ఎయిడ్స్'పై ఎవేర్ నెస్ తీసుకు వస్తూ మంగళవారంనాడు దేశవ్యాప్తంగా 'వరల్డ్ ఎయిడ్స్ డే' జరుపుకొంటున్నారు. ఇందులో భాగంగా ఎయిడ్స్ బాధితులైన పిల్లలు పరిరక్షణ, వారి సహాయం కోసం పద్మశ్రీ కమల్ హాసన్ చెన్నైలో క్యాంపైన్ ప్రారంభించారు. 'హలో ఎఫ్.ఎం., ప్రభుత్వేతర సంస్థ పాపులేషన్ సర్వీస్ ఇంటర్నేషన్ చొరవతో 'పెట్రాల్ తాన్ పిల్లయ' అనే క్యాంపైన్ కు శ్రీకారం చుట్టారు. నెలరోజుల పాటు చేపట్టే ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎయిడ్స్ కు సంబంధించిన పలు ప్రోగ్రామ్ లను హలో ఎఫ్ఎం ప్రసారం చేస్తుంది.
ఈ కార్యక్రమాలను వినే శ్రోతలు 750 రూపాయల చెప్పున విరాళం ఇవ్వాలనీ, ఎయిడ్స్ బాధితులైన పిల్లలను ఆదుకునేందుకు వీటిని వినియోగిస్తామనీ నిర్వాహకులు కోరుతున్నారు. ఈ పిల్లల్ని తమ సొంత బిడ్డలుగా భావించి వారి ఉజ్వల భవిత కోసం ప్రతి ఒక్కరూ సహాయం అందించాలని కమల్ హాసన్ కోరారు. కేవలం మాటలు ద్వారానే కాకుండా చేతల ద్వారా కూడా తన ఔదార్యాన్ని చాటుకుంటూ 1000 మంది పిల్లల్ని కమల్ దత్తత తీసుకున్నారు. గ్రేట్ జాబ్ కమల్...
News Posted: 1 December, 2009
|