'వరల్డ్ కప్ 2011'లో కశ్మీరా
బాలీవుడ్ సెక్సీ బ్యూటీ కశ్మీరా షా '2011 వరల్డ్ కప్'లో చోటు సంపాదించుకుంది. క్రికెట్ నేపథ్యంలో రవికపూర్ తొలిసారిగా హిందీలో రూపొందిస్తున్న 'వరల్డ్ కప్ 2011' చిత్రం గురించే ఈ ముచ్చట. రవికపూర్ తొలిసారి నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఈ చిత్రంలోని ఓ ఐటెం సాంగ్ లో కశ్మీరా తన అందచందాలను ప్రదర్శించబోతోంది. ఒక మంచి ప్రాజెక్ట్ లో అవకాశం రావడంతో వెంటనే అంగీకరించాననీ, ఇంతవరకూ తాను ఎప్పుడూ కనిపించనంత సెక్సీగా ఈ సాంగ్ లో కనిపించి అలరించబోతున్నానని కశ్మీరా పేర్కొంది.
క్రికెట్ వరల్డ్ లో బుకీల పాత్ర, అండర్ వరల్డ్ ప్రభావం అనే అంశాల చుట్టూ అల్లుకున్న కథా చిత్రమే 'వరల్డ్ కప్ 2011'. ఇందులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ను పోలిన పాత్రలో రవికపూర్ నటిస్తున్నారు. ఆయన స్వతహాగా మంచి క్రికెట్ ప్లేయర్ కూడా. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ అంటే తగని ఇష్టం. 20 ఏళ్లలో 30,000 పరుగులు సాధించిన గ్రేట్ రికార్డ్ సచిన్ కు ఉందనీ, తాను సైతం స్కూలు, కాలేజీ రోజుల్నించీ క్రికెట్ టీమ్ కెప్ట్ న్ గా ఉంటూ జాతీయ స్థాయిలో కూడా ఆడాననీ రవికపూర్ చెప్పుకొచ్చారు. క్రికెట్ పట్ల తనకెంత మమకారం ఉందో చెప్పేందుకు క్రికెట్ నేపథ్యంలో సాగే చిత్రం ద్వారా తాను పరిశ్రమలోకి అడుగుపెట్టినట్టు తెలిపారు. ఈ చిత్రంలో మాజీ క్రికెటర్లు సాబా కరీమ్, నిఖిల్ చోప్రాలు క్రికెట్ కామెంటేటర్లుగా నటిస్తుండటం విశేషం. జెమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై 11 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 18న విడుదలకు సిద్ధమవుతోంది.
News Posted: 1 December, 2009
|