మళ్లీ కత్రిన 'గలే లగ్ జా..'

ఎట్టకేలకు ప్రేక్షకుల కోరికే నెగ్గింది. అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ జంటగా నటించిన 'దే దనా దన్' చిత్రం నుంచి నిడివిని దృష్టిలో పెట్టుకుని చివరి నిమిషంలో తొలగించిన వానపాట 'గలే లగ్ జా..'ను ఇప్పుడు తిరిగి సినిమాలో చేర్చారు. గత వారమే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే రిలీజ్ కు ముందే కత్రినా-అక్షయ్ లు వానలో తడుస్తూ తడిపొడి అందాలను ప్రదర్శించిన వానపాట పబ్సిసిటీ పరంగా ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచినప్పటికీ ఆ పాట లేకుండానే తుది కాపీని నిర్మాతలు బయటకు తీసుకువచ్చారు. సినిమా హిట్టయిన తర్వాత ఆడియెన్స్ డిమాండ్ ను బట్టి ఆ పాటను చేరుస్తామని నిర్మాతలు స్పష్టం చేస్తూ వచ్చారు.ప్రపంచవ్యాప్తంగా వారాంతపు కలెక్షన్లు బలంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సినిమా నుంచి తొలగించిన వానపాటను తిరిగి చేర్చి ప్రదర్శిస్తున్నారు.
నిర్మాత రతన్ జైన్ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ, బాక్సాఫీస్ వద్ద సినిమా బాగా ఆడితే పాట చేర్చాలని తాను అనుకున్నామనీ, ఇప్పుడు వారంతపు కలెక్షన్లు రావడం, రిపీడెట్ ఆడియెన్స్ థియేటర్లకు వస్తుండటంతో వానపాటను చేర్చామని తెలిపారు. రిపీటెడ్ ఆడియెన్స్ కు ఇదో ఇన్సెంటివ్ అవుతుందని ఆయన నవ్వుతూ చెప్పారు. కత్రిన-అక్షయ్ ల వానపాట బాక్సాఫీస్ కలెక్షన్లను మరింత స్ట్రాంగ్ చేస్తుందేమో చూడాలి.
News Posted: 2 December, 2009
|