'గ్రామీ' అవార్డుకు 'జైహో'

ప్రతిష్ఠాత్మక 52వ వార్షిక గ్రామీ అవార్డులకు ఎ.ఆర్.రెహ్మాన్ 'జైహో' పాట నామినేట్ అయింది. 'స్లమ్ డాగ్ మిలయనీర్' చిత్రంలోని ఈ పాట రచయత గుల్జార్, తన్వీర్ షా పేర్లు కూడా నామినేట్ అయ్యాయి. డోనీ బెయిల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి గాను గత ఏడాది ఆస్కార్ అవార్డుల పంట పడింది. రెహ్మాన్ కు బెస్ట్ సౌండ్ ట్రాక్, బెస్ట్ కంపోజర్ క్యాటగిరీలలో ఆస్కార్ అవార్డులు వరించాయి. బెస్ట్ లిరిక్ రైటర్లుగా గుల్జార్, తన్వీర్ షా కూడా ఆస్కార్ లు అందుకున్నారు.
రెహ్మాన్ 'జైహో' పాటతో పాటు బ్లాస్ స్ప్రింగ్ స్టీన్ పాట కూడా గ్రామీకి నామినేట్ అయింది. రెహ్మాన్ సంగీతం అందించిన హాలీవుడ్ ప్రాజెక్ట్ 'కపుల్స్ రిట్రీడ్' ఇటీవల బాక్సాఫీస్ హిట్ నమోదు చేసుకుంది. తాజాగా 'స్ట్రీట్ డాన్సింగ్' చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ విజేత అయిన డేవిడ్ ఏ స్లీవర్డ్ తో కలిసి ఆయన పనిచేస్తున్నారు. రెహ్మాన్ ప్రస్తుతం లాస్ ఏంజెలిస్ లోనే ఉన్నారు. గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం 2010 జనవరి 31న లాస్ ఏంజిలిస్ లోని స్టెపిల్ సెంటర్ లో జరుగనుంది.
News Posted: 4 December, 2009
|