జెనీలియా ర్యాంప్ వాక్
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/janiliya11.jpg' align='right' alt=''>చెన్నై: ర్యాంప్ పై అందాల భామలు హొయలు ఒలికిస్తుంటే కన్నార్పకుండా చూడాలని వీక్షకులు కోరుకుంటారు. గ్లామర్ ప్రపంచంలో పేరున్న మోడల్స్, హీరోయిన్లు తరచు తాము ప్రచారకర్తగా వ్యవహరిస్తుల సంస్థల కోసం ఫ్యాషన్ షోస్ లో ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకుంటూ ఉంటారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోయిన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న జెనీలియా ఈనెల 16న చెన్నైలో జరుగనున్న 'చెన్నై ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్'లో ర్యాంప్ వాక్ తో అలరించనుంది. ప్రపంచ వ్యాప్తంగా 10 దేశాలకు చెందిన ఫ్యాషన్ డిజైనర్లు తాము డిజైన్ చేసిన దుస్తులను ప్రముఖ మోడల్స్ తో ధరింపజేసి ఈ ర్యాంప్ పై ప్రదర్శించబోతున్నారు. జెనీలియా శరీరాకృతికి తగ్గట్టుగా డిజైనర్ దుస్తులను ప్రముఖ ఫ్యాషన్ జైనర్ ఇషితా సింగ్ రూపొందించారు.
'ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్' కోసం ఇషితా కోరగానే ఎంతో ఎగ్జయిట్ అయ్యాననీ, ఇందుకోసం తన శరీరాకృతికి నప్పే డిజైనర్ దుస్తులను ఆమె రెడీ చేశారనీ జెనీలియా చెప్పుకొచ్చింది. నటిగా ఇటీవలే తెలుగులో విడుదలైన 'కథ' చిత్రంలో తన నటనకు మంచి ప్రశంసలు దక్కుతాయని సంతోషం వ్యక్తం చేసింది. హిందీలో షాహిద్ కపూర్ కు జంటగా నటించిన 'ఛాన్స్ పే డాన్స్' చిత్రం జనవరిలో విడుదల కానుందనీ, ఈ చిత్రం తనకు మరింత మంచి పేరు తెచ్చిపెడుతుందనీ చెబుతోంది. ఆసక్తికరంగా జెనీలియా హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'బిగ్ స్విచ్' టీవీ షో సైతం వీక్షకులను ఆకట్టుకుంటోంది. వీటికి తోడు 'మగధీర'తో తెలుగులో సంచలన విజయం సాధించిన రామ్ చరణ్ తో అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగబాబు నిర్మాతగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆరంజ్' చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా జెనీలియా నటిస్తోంది. సో..జెనీలియాకు ఇది లక్కీ ఇయర్ గానే చెప్పాలి.
News Posted: 15 December, 2009
|