క్లీన్ సిటీ ప్రచారంలో కత్రిన
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/katrina8.jpg' align='right' alt=''>ముంబై: జనం అభిమానించే తారలు సామాజిక సేవ, ప్రజలను చైతన్యవంతులను చేసే కార్యక్రమాల్లో పాల్గొంటూ వారి పట్ల తమకున్న బాధ్యతను కూడా చాటుకుంటూ ఉంటారు. ఎయిడ్స్, గ్లోబల్ వార్మింగ్, వన్యప్రాణుల సంరక్షణ వంటి అంశాలు ఈ కోవలోకే వస్తాయి. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ సైతం ముంబై సిటీని క్లీన్ గా ఉంచేందుకు మున్సిపల్ కార్పొరేషన్ ఆప్ గ్రేటర్ ముంబై (ఎంసిజిఎం) చేపట్టనున్న 'క్లీన్లీనెస్ క్యాంపైన్'కు తన చేయూతను అందించనుంది.
యునైటెడ్ వే ఆఫ్ ముంబై అనే ఎన్జీవో తో కలిపి ఎంసిజిఎం సంయుక్తంగా మురికి వాడల్లో ఈ క్యాంపైన్ చేపట్టబోతోంది. క్లీన్లీనెస్ డ్రైవ్ లో భాగంగా సబర్బన్ విలే పార్లేలో స్లమ్ వాసులు ఉండే నెహ్రూ నగర్ కు ఎంచుకున్నారు. తాము చేపట్టే ఈ ప్రచార కార్యక్రమాన్ని కత్రినా కైఫ్ ప్రారంభించడంతో పాటు తనవంతు సహకారాన్ని అందించబోతున్నారని ఎంసిజిఎం అధికారి ఒకరు తెలిపారు. ఏడాది పాటు కొనసాగే ఈ ప్రాజెక్ట్ లో కాలేజీ విద్యార్థులు, కార్పొరేట్ ఉద్యోగులు, ఎన్టీఓవోలు మునిస్పిల్ అధికారులతో సహా సుమారు 1500 వాలంటీర్లు పాల్గొంటారని తెలిపారు.
News Posted: 15 December, 2009
|