'అవతార్' స్క్రీనింగ్ కు షారూక్
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/SRK_family.jpg' align='right' alt=''>ముంబై: 'టైటానిక్' విడుదలైన పన్నెండేళ్లకు హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కేమరన్ తెరకెక్కించిన 'అవతార్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈనెల 18న విడుదలవుతోంది. 2400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే హాలీవుడ్ లో ప్రీమియం షో జరుపుకొని ఇంటర్నేషనల్ మీడియా నుంచి హయ్సెస్ట్ రేటింగ్ లతో సమీక్షలు కూడా అందుకుంది. కాగా, ముంబై సబర్బన్ లో ని ఓ మల్టీప్లెక్స్ లో మంగళవారంనాడు జరిగిన 'అవతార్' స్పెషల్ స్క్రీనింగ్ కు ముఖ్య అతిథిగా బాలీవుడ్ బాద్ షా హాజరయ్యారు. ఈ చిత్రం చూసిన షారూక్ ఎంతో థ్రిల్ ఫీలయి వెంటనే స్టూడియో అధికారులను కలుకుని తన పిల్లలు, కుటుంబ సభ్యుల కోసం మరో స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. షారూక్ కోరికను స్టూడియో అధికారులు సానుకూలంగా స్పందించారు.
'షారూక్ కు సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో సినిమాలంటే తగని ఇష్టం. చిన్నప్పట్నించి ఆయన ఇలాంటి సినిమాలను విడవకుండా చూసేవారు. ఆ కారణంగానే అవతార్ స్పెషల్ స్క్రీనింగ్ కు రమ్మని కోరగానే ఆయన అంగీకరించారు' అని షారూక్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. షారూక్ కొత్త చిత్రం 'మై నేమ్ ఈజ్ ఖాన్' థియేటర్ ప్రమోను కూడా అవతార్ స్పెషల్ స్క్రీనింగ్ తో కలిసి చూపించడం విశేషం. 'అవతార్' చిత్రం షారూక్ కు బాగా నచ్చడంతో తన పిల్లలకు కూడా చూపించాలని అనుకున్నట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ మధ్యనే షారూక్ పిల్లలు అమితాబ్ 'పా' చిత్రం వెంటనే చూడాలని అనుకోవడంతో ఆయన అభ్యర్థన మేరకు అమితాబ్ బచ్చన్ కొన్ని పాస్ లు కూడా పంపించారనీ, 'అవతార్' చిత్రం విషయంలోనూ ఆర్యన్, సుహాన (షారూక్ పిల్లలు) ఎంతో ఆసక్తి కనబరచినప్పటికీ మంగళవారంనాడు స్కూల్ స్టడీస్ తో వారు బిజీగా ఉండటంతో రాలేకపోయారనీ వారన్నారు. షారూక్ తన కుటుంబ సభ్యుల కోసం మరో స్పెషల్ స్క్రీనింగ్ కోరిన విషయాన్ని కంపెనీ సిఇవో విజయ్ సింగ్ ధ్రువీకరించారు. 'అవతార్' చిత్రం చూసి షారూక్ ఎంతో ఎగ్జయిట్ అయ్యారనీ, శనివారంనాడు తన కుటుంబ సభ్యుల కోసం మరో ప్రదర్శన ఏర్పాటు చేయాలని కోరారని ఆయన తెలిపారు.
News Posted: 16 December, 2009
|