'లవ్ ఆజ్ కల్' రికార్డ్...
ముంబై: సైఫ్ అలీ ఖాన్, దీపిక పడుకునే జంటగా నటించిన 'లవ్ ఆజ్ కల్' చిత్రం 15 నామినేషన్లతో 5వ అప్సర ఫిలిమ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్ గిల్డ్ అవార్డులకు పోటీపడుతోంది. జనవరి 8న ఈ అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది.
ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు (ఇంతియాజ్ అలీ), ఉత్తమ నటుడు (సైఫ్), ఉత్తమ నటి (దీపిక), ఉత్తమ నేపథ్య గాయకుడు, ఉత్తమ నేపథ్య గాయనితో సహా పలు క్యాటగిరిలకు 'లవ్ ఆజ్ కల్' నామినేట్ అయింది. ప్రేమనేది కాలాలకు, ప్రాంతాలకూ అతీతమైనదని చెప్పే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని ఇంతియాజ్ అలీ తెరకెక్కించారు. ఈ చిత్రం విడుదలైన తొలి రోజే 8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అప్పర ఫిలిమ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్ గిల్డ్ అవార్డులకు 'కమీనే', 'వేక్ అప్ సిద్', 'రబ్ నే బనా ది జోడి', 'గజని' చిత్రాలు సైతం వివిధ కేటగిరిలలో పోటీపడుతున్నాయి. అంధేరిలోని చిత్రకూట్ గ్రౌండ్స్ లో అవార్డుల సెర్మనీ జరుగనుంది.
News Posted: 16 December, 2009
|