కత్రినకు సర్జరీ..డిశ్చార్జ్
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/kat3.jpg' align='right' alt=''>ముంబై: బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ను ముంబైలోని బ్రీచ్ క్యాండి ఆసుపత్రిలో చిన్న శస్త్రచికిత్స అనంతరం గురవారంనాడు డిశ్చార్జ్ చేశారు. బుధవారం రాత్రి ఆమెకు కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో వెంటేనే ఆసుపత్రిలో చేర్చించి ఎపెండిసైటిస్ ఆపరేషన్ జరిపారు.
'కత్రిను ఇప్పుడే ఆసుపత్రి నుంచి డిశ్చార్స్ అయ్యారు. హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉండటంతో ఆమెకు మైనర్ సర్జరీ జరిపారు. కొద్దిపాటి విశ్రాంతితో ఇంట్లోనే క్రిస్మస్ బ్రేక్ తీసుకోబోతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నారు' అని కత్రినా తరఫు ప్రతినిధి ఒకరు తెలిపారు. కత్రిన బాయ్ ఫ్రెండ్ సల్మాన్ సైతం గురువారం ఆసుపత్రిని రెండు సార్లు సందర్శించి మూడు గంటల సేపు ఆమెకు అందుబాటులో ఉన్నారని తెలిసింది. ఇటీవల కాలంలో కత్రిన అస్వస్థతకు గురికావడం ఇది రెండో సారి. గత నెలలో ఆమెకు కామెర్లు రావడంతో ఆసుపత్రి పాలయ్యారు. దీంతో 'దే దనా దన్' ప్రమోష్ కు హాజరు కాలేకపోయారు. కత్రిన ఇటీవల నటించిన 'అజబ్ ప్రేమ్ కి గజబ్ కహాని' సక్సెస్ కాగా, ప్రకాష్ ఝా తీసిన 'రాజ్ నీతి' విడుదల కావలసి ఉంది.
News Posted: 17 December, 2009
|