షారూక్ కు మమత నో!
ఆసిన్, త్రిష, జెనిలియా, శ్రియ వంటి దక్షిణాది హీరోయిన్లు బాలీవుడ్ లో కూడా తన ఉనికిని బలంగా చాటుకునేందుకు పోటీపడుతున్న తరుణంలో మరో దక్షిణాది ముద్దుగుమ్మ మమతా మోహన్ దాస్ సైతం బాలీవుడ్ పై కన్నేసింది. రెండు నెలులుగా ఈ వార్త ప్రచారంలో ఉన్నప్పటికీ మమత మాత్రం అవునని కానీ కాదని కానీ తేల్చిచెప్పలేదు. తాజా సమాచారం ప్రకారం...బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తో నటించే అవకాశం వచ్చినప్పటికీ అందుకు మమత 'నో' చెప్పేసిందట. షారూక్ కథానాయకుడాగు ఫరాఖాన్ దర్శకత్వంలో
త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి రాబోతోంది. దీనికి 'హ్యాపీ న్యూ ఇయర్' అనే టైటిల్ కూడా అనుకుంటున్నారు. ఈ చిత్రం కోసం ఇటీవలే మమత ముంబై వెళ్లి ఫోటో సెషన్ లో కూడా పాల్గొందట. తీరా అదే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీకి అవకాశం వచ్చేసరికి సున్నితంగా ఆ ఆఫర్ ను మమత తోసిపుచ్చిందదట.
'షారూక్ తో నటించాలని ఎవరు మాత్రం అనుకోరు. నేను కూడా అంతే. ఫరాఖాన్ నుంచి ఆఫర్ వచ్చింది. అయితే ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఉంటారని ఆమె తెలిపారు. ఇందులో నా పాత్ర పూర్తి గ్లామరస్ గా ఉంటుంది. అలాంటి పాత్రలు నేను గతంలో చేసినవే. తొలి సినిమా అనగానే అందరి దృష్టి నాపై ఉంటుంది. అలాంటప్పుడు నా తొలి చిత్రమే మల్టీస్టారర్ కావాలని నేను అనుకోవడం లేదు. మరో ఇద్దరు హీరోయిన్లతో స్క్రీన్ పంచుకునేందుకు సుముఖంగా లేను' అంటోంది మమత. గుంపులో గోవిందాగా ఉండకూడదనే మమత నిర్ణయాన్ని కూడా తప్పుపట్టలేం. ప్రస్తుతం తెలుగులో నాగార్జున సరసన 'కేడీ' చిత్రంలో సోలో హీరోయిన్ గా మమత నటిస్తోంది.
News Posted: 21 December, 2009
|