యు ట్యూబ్ లో '3 ఇడియట్స్'
అమీర్ ఖాన్, కరీనాకపూర్, మాధవన్ ప్రధాన పాత్రధారులుగా రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో విధు వినోద్ చోప్రా నిర్మించిన '3 ఇడియట్స్' చిత్రం భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారమే ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. అమీర్ సైతం కొద్దిరోజులుగా వినూత్నరీతిలో ఈ చిత్రం ప్రమోషన్ వర్క్ తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని డౌన్ లోడ్ చేసుకునే అవకాశాన్ని కూడా విధు వినోద్ చోప్రా కల్పిస్తున్నారు. ఈ విషయాన్ని చోప్రా ధ్రువీకరించారు.
పైరేటెడ్ ఫిలిమ్ ప్రింట్స్ ను ఏమాత్రం ప్రోత్సహించకూడదనే ఉద్దేశంతో సినిమా 'డౌన్ లోడ్'కు అవకాశం ఇస్తున్నట్టు ఆయన తెలిపారు. సినిమా విడుదలైన 12 వారాల అనంతరం 'యు ట్యూబ్' నుంచి ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని డౌన్ లోడ్ చేసుకునే వీలుంటుందన్నారు.
News Posted: 24 December, 2009
|