అవతార్ వసూళ్లు 1900 కోట్లు
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/avatar3.jpg' align='right' alt=''>'టైటానిక్' దర్శకుడు జేమ్స్ కేమరన్ అద్భుత దృశ్యకావ్యం 'అవతార్' ప్రపంచవ్యాప్తంగా సంచలన వసూళ్లు సాధిస్తోంది. సుమారు 2000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమైన ఈ చిత్రం తొలి వారం రోజుల్లోనే 1900 కోట్లు సంపాదించి సరికొత్త రికార్డు సృష్టించింది. 'టైటానిక్', 'స్పైడర్ మాన్', 'బ్యాట్ మన్' చిత్రాల తొలివారం రికార్డులను ఈ చిత్రం అధిగమించడంతో పాటు 2009లో అతిపెద్ద హాలీవుడ్ హిట్ గా నిలిచినట్టు ట్వంటీ సెంచరీ ఫాక్స్ ఇండియా ప్రతినిధి విజయ్ సింగ్ తెలిపారు.
ఈ ఏడాది పెద్ద హిట్ గా నిలిచిన బాలీవుడ్ చిత్రాల ప్రారంభ వసూళ్లను కూడా ఈ చిత్రం అధిగమించిందనీ, ఇండియాలో తొలివారం వసూళ్లు 40 కోట్ల రూపాయల వరకూ ఉందనీ ఆయన వివరించారు. దీనితో పాటు ఆల్ టైమ్ బాలీవుడ్ ఓపినింగ్స్ లో కూడా 'అవతార్'కు ఏడో స్థానం దక్కిందన్నారు. ఇంతవరకూ ఓ హాలీవుడ్ చిత్రం బాలీవుడ్ చిత్రాలను మించి వసూలు చేయడం ఇదే ప్రథమమని అన్నారు. హిందీ, తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ చిత్రాన్ని అనువదించడంతో సర్వత్రా క్రేజ్ నెలకొని సంచలనాత్మక వసూళ్లకు కారణమైందని తెలిపారు. 'అవతార్' ఇప్పటికే ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల బరిలో కూడా ముందుంది. బెస్ట్ మోషన్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఒరిజనల్ స్కోర్, ఒరిజనల్ సాంగ్ కేటగిరిలలో ఈ చిత్రం పోటీపడుతోంది.
News Posted: 26 December, 2009
|