న్యూస్ రీడర్ గా బిగ్ బి
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/rann2.jpg' align='right' alt=''>'పా' సినిమాలో అమితాబ్ కనిపించలేదంటూ చిత్ర సమీక్షకులు చేసిన విశ్లేషణ అమితాబ్ గొప్పతనాన్నే చాటుతుంది. అమితాబ్ కనిపించనంతగా ఆ పాత్ర పండిందని చెప్పడమే విశ్లేషకుల ఉద్దేశం. ఆ చిత్రం రిలీజ్ కు ముందు పలు ఆఫ్-స్క్రీన్ ఈవెంట్లలో పాల్గొన్న అమితాబ్ ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్న 'రణ్' చిత్రం కోసం కూడా ఇలాంటి కసరత్తే చేయనున్నారు. ఈ చిత్రంలో మీడియా మేగ్నట్ విజయ్ హర్షవర్దన్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమా రిలీజ్ కు (జనవరి 29) ముందే పలు మీడియా రిలేటెడ్ ఈవెంట్లలో అమితాబ్ పాల్గొనబోతున్నారు. ఇందుకు ఓం ప్రథమంగా ఆయన 'టైమ్స్ నౌ' నేషనల్ ఛానల్ లో యాంకర్ గా కనిపించనున్నారు. ఈ విషయాన్ని 'రణ్' చిత్రం కో-ప్రొడ్యూసర్ షీతల్ తల్వార్ తెలిపారు.
'గ్లోబల్ పాలిటిక్స్ కు ఈవెంట్స్ ను తెలియజేసే ప్రోగ్రాం ఇది. అమితాబ్ తన జీవిత అనుభవాన్ని రంగరించి వార్తల విశ్లేషణ చేయబోతున్నారు' అని తల్వార్ తెలిపారు. మంగళవారం (30వ తేదీ) జరిగే 'టైమ్స్ నౌ' ఇయర్-ఎండ్-రౌండప్ లో అమితాబ్ సుమారు గంటసేపు పాల్గొంటారు. 2009 సంవత్సరంలో విశ్వవ్యాప్త రాజకీయాలకు సంబంధించిన 6 అంశాలపై ఆయన మాట్లాడబోతున్నారు. భారత జాతీయ రాజకీయాలు, టెర్రరిజం, క్రికెట్, స్వైన్ ఫ్లూ, ఆర్థికమాంద్యం, ఒబామా అనే అంశాలు ఇందులో చోటుచేసుకోనున్నారు. బిగ్ బి ఎప్పటిలాగానా ఈసారి కూడా మనందరి మనసులు దోచుకోవడం మాత్రం ఖాయం.
News Posted: 30 December, 2009
|