ప్రధానితో దీపిక డిన్నర్
బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకునేకు ప్రధాని మన్ మోహన్ సింగ్ 10 జనపథ్ రెసిడెన్స్ నుంచి డిన్నర్ కు ఇటీవల ఆహ్వానం అందింది. మన్మోహన్ తో పాటు సోనియా గాంధీ, 20 మంది క్యాబినెట్ మంత్రులు ఈ డిన్నర్ కు హాజరయ్యారు. ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్న జపాన్ ప్రధాని యుకియో హటోయమ దంపతుల గౌరవార్ధం ఈ విందు ఏర్పాటు చేశారు.
హటోయమ దంపతులకు బాలీవుడ్ చిత్రాలంటే ఎంతో ఇష్టం. 'ఓం శాంతి ఓం' చిత్రంలో దీపిక పడుకునే నటనను చూసి ముగ్దులైన వీరిరువురూ ఆమెను కలుసుకోవాలని అనుకోవడంతో ప్రధాని కార్యాలయం నుంచి దీపికకు ఆహ్వానం వెళ్లింది. గోవాలో జరుగుతున్న అశుతోష్ గోవారికర్ 'ఖేలేంగె హమ్ జీ జాన్ సే' చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్న దీపిక ఈ ఆహ్వానం అందుకున్న వెంటనే ఒకరోజు విరామం తీసుకుని డిన్నర్ లో పాల్గొంది. ఇలాంటి అకేషన్ కు తనకు ఆహ్వానం అందడం అరుదైన గౌరవంగా భావిస్తున్నట్టు దీపిక పేర్కొంది. ఈ ఈవెంట్ కోసం ఆమె మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన చీరను ధరించారు.
News Posted: 30 December, 2009
|