న్యూడ్ ఫోజిచ్చిన దీపిక
http://www.telugupeople.com/uploads/tphome/images/2010/Deepika-calender.jpg' align='right' alt=''>ముంబై: బి టైన్ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నానీ 2010 క్యాలెండర్ ను రిలీజ్ చేశారు. బాలీవుడ్ టాప్ స్టార్ట్స్ తో 11 ఏళ్లుగా షోటో షూట్స్ తో క్యాలెండర్లు చేస్తున్నారాయన. అయితే క్యాలెండర్లు అమ్ముకోవడానికి ఆయన ఎన్నడూ ఆసక్తి కనబరచకుండా తన పనితీరును బాలీవుడ్ అభిమానులకు చేర్చడానికే మక్కువ చూపుతుంటారు. ఈసారి క్యాలెండర్ లోనూ ఆయన తన ప్రత్యేకతను నిలుపుకొన్నారు. బ్లాక్ అండ్ వైట్ లో ఆయన తీసిన దీపిక పడుకునే న్యూడ్ ఫోజ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. గత ఏడాది దీపికను చీరలో చూపించాపనీ, అందుకు పూర్తి భిన్నంగా న్యూడ్ ఫీల్ వచ్చేలా ఈ స్టిల్ తీశాననీ, అయితే దీపికను సెన్సువల్ గా, కళాత్మకంగా చూపించాననీ డబ్బూ రత్నా చెప్పుకొచ్చారు.
స్టార్స్ ఎప్పటికప్పుడు తమ లుక్స్, స్టైలింగ్ తో ప్రయోగాలు చేసేందుకు ఇలాంటి ఫోటా షాట్స్ ఉపకరిస్తుంటాయి. ప్రతి ఏడాది అక్టోబర్ నుంచి ఇయర్లీ క్యాలెండర్ కోసం డబ్బూ ప్రిపరేషన్స్ ప్రారంభిస్తుంటారు. ఈ ఏడాది క్యాలెండర్ లో బిగ్ బి, ఐశ్వర్యారాయ్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్, ప్రియాంక చోప్రా, కాజల్, అక్షయ్ కుమార్, కరీనా కపూర్, కత్రినా కైఫ్, జాన్ అబ్రహం, సోనం కపూర్, కంగనా రనౌత్ తో పాటు తొలి పర్యాయం ఆసిన్, ఫరా అక్తర్, జెనిలీయా, ఇమ్రాన్ ఖాన్ లు కూడా చోటుచేసుకున్నారు. ఇందులో ఉన్న స్టార్స్ అంతా తన మిత్రులేననీ, వీరిలో ఎవరు ఎక్కువ హాట్ గా ఉన్నారని అడిగితే అందరూ హాట్ గానే ఉన్నారన్నదే తన అభిప్రాయమని డబ్బూ ఓ ప్రశ్నకు సమాధానంగా నవ్వుతూ చెప్పారు.
News Posted: 6 January, 2010
|