అమీర్ కు చేతన్ భగత్ సారీ!
http://www.telugupeople.com/uploads/tphome/images/2010/chetanbhagat1.jpg' align='right' alt=''>ముంబై: హిందీ బ్లాక్ బస్టర్ '3 ఇడియట్స్' టైటిల్ క్రెడిట్ విషయంలో తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదంటూ చేతన్ భగత్ లేవనెత్తిన వివాదానికి ఆయనే స్యయంగా తెరదించే ప్రయత్నం చేశారు. హీరో అమీర్ ఖాన్, చిత్ర దర్శకనిర్మాతలకు చేతన్ భగత్ క్షమాపణ తెలిపారు. ఈ వివాదానికి తెరదించాలని తాను కోరుకుంటున్నట్టు స్పష్టం చేశారు.
చేతన్ భగత్ తాను రాసిన 'ఫైవ్ పాయింట్ సమవన్' స్ఫూర్తితోనే 70 శాతానికి పైగా సినిమా స్క్రీన్ ప్లే ఉందనీ, ఇంత చేసి కూడా తనకు సరైన క్రెడిట్ ఇవ్వలేదనీ ఆరోపించడంతో తొలుత వివాదం తలెత్తింది. దీనికి అమీర్ స్పందిస్తూ, చేతన్ భగత్ తో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారమే ఆయనకు క్రెడిట్ ఇచ్చామని వివరణ ఇచ్చారు. ఇదే సమయంలో ఆయనపై పరువు నష్టం కేసు వేయాలని నిర్మాత చోప్రా, దర్శకుడు ఇరానీలకు సూచించారు. ఈ క్రమంలోనే దర్శకనిర్మాతలు చేతన్ భగత్ పై లీగల్ పోరు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో చేతన్ భగత్ ఈ వివాదానికి తెరదించుతూ అమీర్ తో సహా ఫిల్మ్ మేకర్స్ కు సారీ చెప్పారు. '3 ఇడియట్స్ టీమ్ వ్యతిరేకంగా నేను ఏమీ చేయబోవడంలేదు. వారు కొన్ని తప్పదాలు చేసినట్టు భావించిన అంశాలపైనే నేను విభేదించాను. వారి వ్యక్తిత్వాన్ని కానీ, ఎలాంటి మనుషులనే విషయాన్ని గానీ నేను తప్పుపట్లేదు. ఏది ఏమైనప్పటికీ వారి కుటుంబాలకు కలిగిన మనస్తాపానికి క్షమాపణ చెప్పుకుంటున్నాను' అని భత్ ఓ న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతూ చెప్పారు. తన వాదనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలనీ, అదే సమయంలో వారెవరూ ముఖ్యంగా అమీర్ తో సహా ఎవ్వరినీ వ్యతిరేకించరాదనీ ఆయన కోరారు.
News Posted: 7 January, 2010
|