కరీనాకు సర్ ప్రైజ్ గిఫ్ట్
ముంబై: అందాల భామలు అపురూప బహుమతులు అందుకోవడం పెద్ద విషయం కాదు. బాలీవుడ్ సుందరి కరీనాకపూర్ కు అలాంటి ఓ ఖరీదైన బహుమతి ఈమధ్యన అందింది. ఆ బహుమతి విలువ అక్షరాలా 5 లక్షలు. అయితేనేం? కరీనా ఆ బహుమతిని తిప్పికొట్టి తన స్టాఫ్ ను ఆశ్చర్యపోయేలా చేసింది.
కరీనాకపూర్ చిరునామాతో ఓ అజ్ఞాత వ్యక్తి కొరియర్ ద్వారా ఈ బహుమతిని పంపించారు. అది నేరుగా కరీనా స్టాఫ్ దగ్గరకు చేరింది. అందులో ఒకే వజ్రంతో చేసిన రింగ్ ఉంది. అప్పడు కరీనా ఇంట్లో లేకపోవడంతో ఆ విషయాన్ని కరీనాకు సిబ్బంది తెలియజేశారు. కరీనా ఏమాత్రం తడబడకుండా ఆ పార్సిల్ ను పోలీసులకు అప్పజెప్పి దర్యాప్తు చేయాల్సిందిగా కోరాలని సిబ్బందికి సూచించారు. పార్సిల్ తో పాటు ఓ లేఖ కూడా ఉందట. అందులో సదరు నగ దుబాయ్ లో కొన్నాననీ, కరీనాకు గిఫ్ట్ గా ఇది పంపుతున్నాననీ ఉందట. కోరి చిక్కులు తెచ్చుకోవడం ఇష్టంలేని కరీనా తెలివిగా స్పందించి అందరిచేతా ఔరా అనిపించుకుంది.
News Posted: 7 January, 2010
|