'పా' చిత్రానికి మోడి వరం
http://www.telugupeople.com/uploads/tphome/images/2010/paa6.jpg' align='right' alt=''>అమితాబ్ బచ్చన్ నటనకు ఈ ఏడాది అవార్డులు ఖాయమని అంతా ప్రశంసిస్తున్న 'పా' చిత్రానికి గుజరాత్ ప్రభుత్వం వినోదం పన్ను మినహాయించింది. ఈ మేరకు శుక్రవారంనాడు ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, యువజన-సాంస్కృతిక శాఖ సెక్రటరీ, రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ తో కూడిన త్రిసభ్య కమిటీ ఈ చిత్రానికి రాష్ట్రంలోని అన్ని థియేటర్లలోనూ వినోదం పన్ను మినహాయించాల్సిందిగా సిఫారసు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జన్యుపరమైన లోపంతో పుట్టిన 13 ఏళ్ల బాలుడు ఆరోగా అమితాబ్ ఈ చిత్రంలో నటించారు. అతని తండ్రి పాత్రను అభిషేక్ బచ్చన్ పోషించారు. సునీల్ మాన్ చంద్, ఎబి కార్పొరేషన్, బిగ్ పిక్చర్స్ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి ఆర్.బల్కి దర్శకత్వం వహించారు.
ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కోసం అమితాబ్ బచ్చన్ ప్రత్యేకంగా ఈ చిత్రం స్పెషల్ స్క్రీనింగ్ ను ఇటీవల గాంధీనగర్ లోని ఓ మల్టీప్లెక్స్ లో ఏర్పాటు చేశారు. అమితాబ్ నేరుగా ముంబై నుంచి వచ్చి ఇందులో పాల్గొనడంతో పాటు ఈ చిత్రానికి వినోదం పన్ను మినహాయించాల్సిందిగా మోడికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలో వినోదం పన్ను మినహాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విశేషం. గుజరాత్ లో వందలాది సినిమా థియేటర్లతో పాటు 22 మల్టీప్లెక్స్ లు ఉన్నాయి. వీటిద్వారా ప్రభుత్వానికి ఏటా 22 కోట్ల రూపాయలు వినోదం పన్ను రూపంలో లభిస్తుంది.
News Posted: 8 January, 2010
|