పా-3 ఇడియట్స్ కు స్క్రీన్ పంట
ముంబై: అవార్డ్స్ నైట్ లో 'పా', '3 ఇడియట్స్' చిత్రాలు విజయకేతనం ఎగురువేశాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డవలప్ మెంట్ అథారిటీ (ఎంఎంఆర్ డిఎ) గ్రౌండ్స్ లో శనివారం రాత్రి నోకియా 16వ వార్షిక స్టార్ స్క్రీన్ అవార్డుల ప్రదానోత్సవం కన్నులపండువగా జరిగింది.
వివిధ కేటిగిరిలలో 21 చిత్రాలు ఎంపిక కాగా, అమితాబ్-అభిషేక్-విద్యాబాలన్ నటించిన 'పా', అమీర్ ఖాన్-కరీనాకపూర్-ఆర్ మాధవన్, శర్మాన్ జోషి-బొమన్ ఇరానీ తదితరులు నటించిన '3 ఇడియట్స్' చిత్రాలు ఎక్కువ అవార్డులను సొంతం చేసుకున్నాయి. 'పా' చిత్రానికి 5 అవార్డులు లభించాయి. ఉత్తమ నటుడు అవార్డును అమితాబ్, ఉత్తమ నటి అవార్డు విద్యాబాలన్, ఉత్తమ బాలనటుడు అవార్డును ప్రతీక్, ఉత్తమ సహాయ నటి అవార్డును అరుంధతి నాగ్ (అమితాబ్ అమ్మమ్మ పాత్రను పోషించిన నటి) అందుకున్నారు. '3 ఇడియట్స్' చిత్రానికి 10 అవార్డులు దక్కాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు (రాజ్ కుమార్ హిరానీ), ఉత్తమ నూతన నటుడు (ఓమి వైద్య), పాపులర్ ఛాయెస్ ఉత్తమ నటి అవార్డు (కరీనాకపూర్), కామిక్ రోల్ ఉత్తమ నటుడు (ఓమి వైద్య), ఉత్తమ స్క్రీన్ ప్లే (రాజ్ కుమార్ హిరానీ, అభిజిత్ జోషి, విధువినోద్ చోప్రా), ఉత్తమ ఎడిటర్ (రాజ్ కుమార్ హిరానీ), ఉత్తమ కొరియోగ్రాఫర్ (బాస్కో సీజర్), ఉత్తమ సంభాషణల రచయిత (అభిజిత్ జోషి), ఉత్తమ విలన్ (బొమన్ ఇరానీ) అవార్డులు అందుకున్నారు.
News Posted: 11 January, 2010
|