'అవతార్'కు 2 గోల్డెన్ గ్లోబ్స్
http://www.telugupeople.com/uploads/tphome/images/2010/avatar5.jpg' align='right' alt=''>కాలిఫోర్నియా: ఆస్కార్ తర్వాత ప్రతిష్ఠాత్కంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డును జేమ్స్ కేమరూన్ దక్కించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఆంగ్ల చిత్రం 'అవతార్'కు గాను ఉత్తమ దర్శకుడిగా కేమరూన్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది. 3-డి సైంటిఫిక్ ఫిక్షన్ గా 'అవతార్' చిత్రాన్ని కేమరన్ తెరకెక్కించారు. పన్నెండేళ్ల క్రితం రూపొందిన 'టైటానిక్' చిత్రానికి కూడా కేమరన్ ఉత్తమ దర్శకుడుగా గోల్డెన్ గ్లోబ్ అందుకున్నారు. 90 మంది రిపోర్టర్లతో కూడిన హాలీవుడ్ ఫారెన్ ప్రెస్ అసోసియేషన్ ద్వారా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఎన్.బి.సి.లో అవార్డుల లైవ్ ఇచ్చారు.
'అవతార్' చిత్రానికి ఉత్తమ దర్శకుడి అవార్డుతో పాటు బెస్ట్ ఫీచర్ డ్రామా అవార్డు కూడా లభించింది. బ్రాడ్లీ కూపర్ నటించిన స్క్రూబాల్ కామెడీ 'హ్యాంగోవర్'కు ఉత్తమ చిత్రం-కామెడీ అవార్డు దక్కింది. 'ది బ్లైండ్ సైడ్' చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటి (డ్రామా) అవార్డును సాండ్రా బుల్లాక్ దక్కించుకున్నారు. 'క్రేజీ హార్ట్'లో నటనకు ఉత్తమ నటుడు (డ్రామా) అవార్డును జెఫ్ బ్రిడ్జెస్ అందుకున్నారు. బెస్ట్ యాక్ట్రస్ (కామెడీ) అవార్డును మెర్యల్ స్ట్రీఫ్ (జులియా అండ్ జులియా), బెస్ట్ యాక్టర్ (కామెడీ) అవార్డును రాబర్ట్ డౌనే జూనియర్ (షెర్లాక్ హోమ్స్) గెలుచుకున్నారు. సపోర్టింగ్ యాక్టర్ అవార్డును క్రిస్టోఫ్ వాల్జ్ (ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్), ఫారెన్స్ లాంగ్వేజ్ ఫిల్మ్ గా జెర్మనీకి చెందిన 'వైట్ రిబ్బన్' ఎంపికైంది. ఉత్తమ యానిమేటెడ్ ఫిల్డ్, బెస్ట్ స్కోర్ (మైఖేల్ జియాచినో) అవార్డులను 'అప్' దక్కించుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా 'క్రేజీ హార్ట్'లోని 'ది వియరీ కైండ్', టెలివజన్ సిరీస్-డ్రామాగా 'మేడ్ మెన్', టెలివిజన్ సిరీస్-కామెడీగా 'గ్లీ' ఎంపికయ్యాయి.
News Posted: 18 January, 2010
|