నిన్న జైహో..నేడు నానా!
http://www.telugupeople.com/uploads/tphome/images/2010/rehman4.jpg' align='right' alt=''>'స్లమ్ డాగ్ మిలయనీర్' చిత్రంలోని 'జై హూ' పాటతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించి రెండు ఆస్కార్ లు గెలుచుకున్న తొలి భారతీయ సంగీత దర్శకుడుగా ఎ.ఆర్.రెహ్మాన్ గత ఏడాది సంచలనం సృష్టించారు. ఈ ఏడాది సైతం ఆయన మరోసారి ఆస్కార్ నామినేషన్ కు వెళ్లారు. హాలీవుడ్ చిత్రం 'కపుల్స్ రిట్రీట్' కోసం ఆయన కంపోజ్ చేసిన 'నానా' అనే పాట ఈ ఏడాది జరుగనున్న 82వ అకాడమీ అవార్డుల కోసం అవార్డు కమిటీ నామినేషన్ కు వెళ్లింది. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన 63 పాటల్లో ఇదొక పాటగా కమిటీ గుర్తించింది. ఈ పాటలో కొంత భాగాన్ని రెహ్మాన్ కుమారుడు పాడటం విశేషం. ఫిబ్రవరి 2న నామినేషన్లను ప్రకటించనున్నారు.
'నానా' పాట ఆస్కార్ నామినేషన్ కు వెళ్లిన విషయాన్ని రెహ్మాన్ చెన్నైలో ధ్రువీకరించారు. ఈ పాటలోని కొంత భాగాన్ని తన కుమారుడు పాడాడనీ, ఇప్పుడు ఆస్కార్ నామినేషన్ కు కూడా వెళ్లడం తన కుమారుడికి ఒక మంచి ఆరంభంగా భావిస్తున్నాననీ తెలిపారు. ఆంగ్లం, ఆఫ్రికన్, హిందీ, స్పానిష్, సంస్కృతం వంటి ట్రాక్స్ తో కూడిన ఈ ఆల్బమ్ త్వరలోనే ఇండియాలో కూడా విడుదల కానుంది. 'నానా'కు మళ్లీ ఆస్కార్ వరిస్తే రెహ్మాన్ వరుసగా రెండో ఏడాది కూడా ఆస్కార్ గెలుచుకున్న ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ గా చరిత్ర సృష్టించినట్టే.
News Posted: 19 January, 2010
|