'నేషనల్ బింగో' అతిథి బిగ్ బి
http://www.telugupeople.com/uploads/tphome/images/2010/abhisekh-amitab.jpg' align='right' alt=''>బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ 'నేషనల్ బింగో నైట్' కార్యక్రమం ద్వారా తొలిసారి బుల్లితెరపై అడుగుపెడుతున్నారు. ఈ కార్యక్రమానికి ఆయన హోస్ట్ గా వ్యవహరించనుండటం విశేషం. మరి అభిషేక్ తొలి షో లో పాల్గొనే తొలి గెస్ట్ ఎవరై ఉంటారు? ఆ సస్పెన్స్ కు కూడా తెరపడింది. ఆయన మరెవరో కాదు...అభిషేక్ తండ్రి అమితాబ్ బచ్చన్. బుల్లితెరపై 'కౌన్ బనేగా కరోడ్' వంటి పలు పాపులర్ గేమ్ షోలకు హోస్ట్ గా వ్యవహరించిన విశేషానుభవం అమితాబ్ కు ఉంది.
బుల్లితెర ఎంట్రీపై అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ, ఇంతవరకూ సినిమాల్లో తాము చేసిన పాత్రల ద్వారానే అభిమానులు, ప్రేక్షకులకు తాము తెలుసనీ, 'బింగో నైట్'లో తాము నటించేది ఉండదనీ, అయితే అభిమానులు నేరుగా కలుసుకునే అవకాశం ఉంటుందనీ అన్నారు. ఈనెల 23 నుంచి 'నేషనల్ బింగో' ప్రసారం మొదలవుతుంది. కలర్స్ ఛానెల్ లో ఈ ప్రోగ్రామ్ ను వీక్షించవచ్చు.
News Posted: 20 January, 2010
|