ఫిబ్రవరి 27న 'ఫిల్మ్ ఫేర్'
ముంబై: భారతీయ సినీ పరిశ్రమ ప్రతిష్ఠాత్మకంగా భావించే 56వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం ఫిబ్రవరి 27న జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. ముంబైలోని యష్ రాజ్ స్టూడియోలో జరిగే ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథి ఎవరనేది మాత్రం ఇంకా నిర్ణయించాల్సి ఉంది.
ఫిల్మ్ ఫేర్ అవార్డులను ప్రారంభించినప్పుడు 5 కేటిగిరిలలో అవార్డులు ఉండేవనీ, ఇప్పుడు 37 కేటిగిరిలు అయ్యాయనీ, ఇది గణనీయమైన పురోగతిగా చెప్పాల్సి ఉంటుందనీ వరల్డ్ వైడ్ మీడియో ప్రైవేట్ లిమిటెడ్ (టైమ్స్ ఆఫ్ ఇండియా, బిబిసి వరల్డ్ వైడ్ జాయింట్ వెంచర్) సిఇవో తరుణ్ రాయ్ తెలిపారు. ఈ అవార్డుల కార్యక్రమాన్ని పాన్-ఇండియా మొబైల్ ఆపరేటర్ ఇడియా సెల్యులార్ అసోసియేషన్ తో నిర్వహించబోతున్నారు. అవార్డుల నామినీలను ఆడియెన్స్ పోల్ ద్వారా ఎంపిక చేస్తారు. అవార్డు విజేతల ఎంపికలో పోలింగ్ ఫలితాలతో పాటు ప్రత్యేకంగా నియమించిన జడ్జిల ప్యానెల్ కూ సమ ప్రాధాన్యం ఉంటుంది. కాగా, ఈ ఏడాది 111 చిత్రాలు వివిధ కేటగిరిలలో అవార్డుల కోసం పోటీపడుతున్నాయి.
News Posted: 21 January, 2010
|