ప్రియాంకకు జాతీయ అవార్డు
http://www.telugupeople.com/uploads/tphome/images/2010/priyanka-chopra2.jpg' align='right' alt=''>న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక 56వ జాతీయ చలన చిత్ర అవార్డులను శనివారంనాడు ప్రకటించారు. 2008 సంవత్సరానికి గాను ప్రకటించిన ఈ అవార్డులలో ఉత్తమ నటిగా ప్రియాంక చోప్రా ఎంపికైంది. ఇప్పటికే పలు అవార్డులను దక్కించుకున్న 'ఫ్యాషన్' చిత్రంలో నటనకు గాను ప్రియాంకకు ఈ అవార్డు వరించింది. ఇదే చిత్రంలో నటించిన కంగనా రనౌత్ కు ఉత్తమ సహాయనటి అవార్డు లభించింది. ఉత్తమ నటుడుగా మరాఠీ చిత్రం 'జోగ్వా'లో నటించిన ఉపేంద్ర లిమయే ఎంపికయ్యారు. బెంగాళీ చిత్రం 'అంత హీన్' ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఉత్తమ హిందీ చిత్రం అవార్డును అభిషేక్ కపూర్ నటించిన 'రాక్ ఆన్' దక్కించుకుంది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా తెలుగు చిత్రం '1940లో ఒక గ్రామం' ఎంపికైంది.
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అభయ్ డియోల్ నటించిన 'ఓయే లక్కీ లక్కీ ఓయే' ఎంపికైంది. 'రాక్ ఆన్' చిత్రంలో నటనకు గాను ఉత్తమ సహాయనటుడుగా అర్జున్ రాంపాల్ ఎంపికయ్యారు. ఉత్తమ తొలి చిత్రంగా నీరజ్ పాండే 'ఎ వెన్స్ డే' ఎంపికైంది. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ చిత్రంగా 'ముంబై మేరి జాన్' , ఉత్తమ నేపథ్య గాయకుడుగా హరిహరన్, ఉత్తమ నేపథ్య గాయనిగా శ్రేయ ఘోషల్, ఉత్తమ యానిమేషన్ గా చిత్రంగా 'రోడ్ సైడ్ రోమియో', ఉత్తమ బాలల చిత్రంగా 'గుబచి గను' ఎంపికయ్యాయి.
News Posted: 23 January, 2010
|